కర్ణాటక కూడా మిస్.. నాలుగు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. దీంతో కాంగ్రెస్ మరో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడిక కేవలం 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మాత్రమే ఈ పార్టీ పవర్ లో కొనసాగుతోంది. దక్షిణాదిలో కాంగ్రెస్ కి కర్ణాటకే కీలకం. అంటే సదర్న్ లో అధికారంలో కొంతకాలమైనా కొనసాగిన రాష్ట్రం ఇదే.. బీజేపీ బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఈ స్టేట్ మాత్రమే ఉండగా.. కాంగ్రెస్ దానికి దీటుగా ఉంటూ వచ్చింది. కానీ […]

కర్ణాటక కూడా మిస్.. నాలుగు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్
Follow us

|

Updated on: Jul 24, 2019 | 12:15 PM

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. దీంతో కాంగ్రెస్ మరో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడిక కేవలం 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మాత్రమే ఈ పార్టీ పవర్ లో కొనసాగుతోంది. దక్షిణాదిలో కాంగ్రెస్ కి కర్ణాటకే కీలకం. అంటే సదర్న్ లో అధికారంలో కొంతకాలమైనా కొనసాగిన రాష్ట్రం ఇదే.. బీజేపీ బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఈ స్టేట్ మాత్రమే ఉండగా.. కాంగ్రెస్ దానికి దీటుగా ఉంటూ వచ్చింది. కానీ జేడీ-ఎస్ తో జట్టు కట్టి చేతులు కాల్చుకుంది. అసలే లోక్ సభ ఎన్నికల్లో కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకుని డీలా పడిన ఈ పార్టీ..కర్ణాటకపై కొండంత ఆశలు పెట్టుకున్నా.. ఫలితం లేకపోయింది. ఇక కమలనాథులు ఇక్కడ అధికారం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్… ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పడిన పరిస్థితి వంటిదానినే ఎదుర్కొంటోంది. అటు-దేశంలో… 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండడం విశేషం. మధ్యప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి.. బీజేపీ చేతికి పవర్ అప్పగించే సూచనలున్నాయని అంటున్నారు. ఈ స్టేట్ లో కమలం పార్టీ పాగా వేయాలంటే గవర్నర్ మార్పు తప్పనిసరి. అందువల్లే ఆగస్టు లేదా సెప్టెంబరు నెలల్లో ఆ రాష్ట్రానికి కేంద్రం కొత్త గవర్నర్ ని నియమించి.. అప్పుడే చాప కింద నీరులా అధికార పగ్గాలను చేజిక్కించుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అసలే రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవిని వదలుకోవడంతో కొత్త వారసుడిని ఎన్నుకోలేక మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక కూడా ‘ చేజారడం ‘ మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టే !

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!