Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. మార్చి 14న ఎన్నికలు

తెలంగాణలో ఇప్పుడు బీజేపీ మంచి జోరు చూపిస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు గ్రేటర్‌ కార్పోరేషన్ ఎన్నికల్లో మంచి ప్రదర్శన చేయడంతో అటు నాయకులతో పాటు..

Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. మార్చి 14న ఎన్నికలు
Follow us

|

Updated on: Feb 15, 2021 | 2:17 PM

Graduate MLC Elections:  తెలంగాణలో ఇప్పుడు బీజేపీ మంచి జోరు చూపిస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు గ్రేటర్‌ కార్పోరేషన్ ఎన్నికల్లో మంచి ప్రదర్శన చేయడంతో అటు నాయకులతో పాటు ఇటు కార్యకార్తలు కూడా బాగా యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో పార్టీని మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లడంపై పార్టీ ఫోకస్ పెట్టింది. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ నిర్వహించి.. అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి అభ్యర్థులను ఖరారు చేసింది.  హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా స్థానానికి రామచంద్రరావు పేరును ఫిక్స్ చేశారు. ఈయన ఆల్రెడీ ఈ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని రంగంలోకి దించారు. .

ఈ సమాచారం వీరిద్దరికి అనధికారికంగా ఎప్పుడో వచ్చింది. దీంతో ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. తాజాగా అధికారికంగా పేర్లు వెల్లడించింది అధిష్టానం. మార్చి 14న  ఈ ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు:

పోలింగ్‌ డేట్ : మార్చి 14

నామినేషన్లు ప్రారంభం: ఫిబ్రవరి 16

నామినేషన్లకు లాస్ట్ డేట్:  ఫిబ్రవరి 23

నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 24

నామినేషన్ల ఉపసంహరణ: ఫిబ్రవరి 26

పోలింగ్‌ సమయం: ఉదయం 8 నుంచి  సాయంత్రం 4 గంటల వరకు

ఓట్ల లెక్కింపు:  మార్చి 16

Also Read:

B Tech Ravi: కడప ఎస్పీని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి.. వారిపై ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

Vijay Rupani Corona Positive: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్.. నిర్ధారించిన డాక్టర్లు