AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చెప్పుతో కొట్టుకున్న వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.. రీజన్ ఇదే

కొత్తపల్లి సుబ్బారాయుడు.. జిల్లాలో మంచి పట్టున్న నేత. 1989 ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున తొలిసారి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా నాలుగుసార్లు అక్కడ నుంచే విజయ బావుటా ఎగరవేశారు.

Andhra Pradesh: చెప్పుతో కొట్టుకున్న వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.. రీజన్ ఇదే
Kothapalli Subbarayudu
Ram Naramaneni
|

Updated on: Mar 02, 2022 | 4:40 PM

Share

West Godavari District: ఏపీలో జిల్లాల లొల్లి కొత్త పుంతలు తొక్కుంతోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు( Kothapalli Subbarayudu) ఏకంగా చెప్పుతో కొట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. నర్సాపురం ఎమ్మెల్యేగా ముదునూరి ప్రసాదరాజు(Mudunuri Prasada Raju)ను గెలిపించినందుకు ఇలా చెప్పుతో కొట్టుకుని ప్రజలను క్షమాపణలు అడిగారు. నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ కొన్ని రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎమ్మెల్యే ప్రసాదరాజు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆయనకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రాన్ని సాధించడంలో ప్రసాదరాజు ఫెయిల్‌ అయ్యారని ఆరోపించారు సుబ్బారాయుడు.  ఓ అసమర్థుడ్ని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాను మూడు భాగాలుగా విభజించారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిగా కొత్త జిల్లాలను ప్రకటించింది ప్రభుత్వం. దీంతో నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిని పశ్చిమగోదావరి జిల్లాగా ప్రకటించి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ఏర్పాటు చేశారు. దీనిపైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బ్రిటిష్‌, డచ్‌ హయాం నుంచే సబ్‌ డివిజన్‌గా ఉన్న నరసాపురం పట్టణాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంది..

ఇప్పుడు ఇదే ఇష్యూ వైసీపీలోనూ వర్గపోరుకు కారణం అవుతోంది. మ్యాటర్ ఇప్పుడు మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది. ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్లే నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించలేదని ఆరోపిస్తూ పోరాటాన్ని ముమ్మరం చేశారు కొత్తపల్లి సుబ్బారాయుడు. కొత్తపల్లి సుబ్బారాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లాలో మంచి పట్టున్న నేత. 1989 ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున తొలిసారి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా నాలుగుసార్లు అక్కడ నుంచే విజయ బావుటా ఎగరవేశారు. చంద్రబాబు కేబినెట్‌లో విద్యుత్తు శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీలో చేరి.. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అనంతరం వెసీపీలో చేరి 2014 ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గం నుంచి మరోసారి పోటీచేసి పరాజయం పాలయ్యారు. తర్వాత టీడీపీలో చేరినా, గత ఎన్నికల ముందు మళ్లీ వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు గెలుపు కోసం తనవంతు సహకారం అందించారు.

Also Read: వాహనం ఆపగా కదులుతూ కనిపించిన గోనె సంచులు.. తనిఖీ చేసిన పోలీసులు షాక్

చెవి నొప్పితో ఆస్పతికి వెళ్లిన మహిళ.. అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. తెల్లారేసరికి ఊహించని షాక్