Andhra Pradesh: ఉద్యోగులపై అచ్చెన్న సంచలన కామెంట్స్.. ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చిన మంత్రి వెల్లంపల్లి..

Andhra Pradesh: ఉద్యోగులపై అచ్చెన్న సంచలన కామెంట్స్.. ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చిన మంత్రి వెల్లంపల్లి..
Tdp Vs Ycp

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్ చేశారు.

Shiva Prajapati

|

Mar 02, 2022 | 5:49 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. 2019 ఎన్నికల్లో ఉద్యోగుల వలనే ఓడిపోయామని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులను గౌరవించామని, 42 శాతం పిట్‌మెంట్ కూడా ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, భయపడి కొంత, ప్రలోభాలకు మరికొంత ఉద్యోగులు వైసీపీ పార్టీకి లొంగిపోయారంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు.. ఒక మూర్ఖుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటూ పరుష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతులు మొదటిసారి క్రాప్ హాలిడే ప్రకటించారని, ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమని దుయ్యబట్టారు.

పాదయాత్ర చేసి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రం దివాళా తీసిందని, ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెడుతున్నారని, అవి రైతులకు ఉరితాళ్ళుగా మారాయని వ్యాఖ్యానించారు. మరోవైపు రైతులకు యూరియా కూడా దొరకడం లేదన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అయితే ఖాకీ దుస్తులను మరిచిపోయి మరీ వైసీపీకి సేవ చేశారంటూ సంచలన కామెంట్స్ చేశారు అచ్చెన్నాయుడు. చెప్పిన పనులు చేసిన అన్న అంటూనే జగన్ సున్నం పెట్టారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో గెలవాలని కోడికత్తి, వివేకా హత్య డ్రామాలు ఆడారని జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు అచ్చె్న్న. నాడు చంద్రబాబుకు సీబీఐ అంటే భయమన్న వ్యక్తులు.. నేడు చంద్రబాబే సీబీఐని మేనేజ్ చేస్తున్నారని సిగ్గులేకుండా మట్లాడుతున్నారంటూ వైసీపీ నాయకులపై అచ్చెన్న ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులది నోరా.. తాటి మట్టా అంటూ ఫైర్ అయ్యారు. ఈ మూర్ఖత్వపు ముఖ్యమంత్రి.. కలలో లేచి రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తున్నట్లు లెటర్ ఇచ్చినా.. ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావచ్చన్న అచ్చెన్న.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. తదుపరి ఎన్నికల్లో టీడీపీకి 165 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు అచ్చె్న్నాయుడు.

అచ్చెన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి వెల్లంపల్లి.. ఇదిలాఉంటే.. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. అచ్చెన్న కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగినా టీడీపీ ఒక్క సీటు కూడా రాలేదని గుర్తు చేశారు. ‘‘పార్టీ లేదు బొక్క లేదు అన్న అచ్చెన్నాయుడు.. 150 సీట్లు టీడీపీకి వస్తాయని పగటి కలలు కంటున్నారు.’’ అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌ను ఓడించడం చంద్రబాబు తరం కాదన్నారు మంత్రి వెల్లంపల్లి. అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి. ఇదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పైనా సెటైర్లు పేల్చారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. లోకేష్ ప్రజా జీవితానికి పనికి రాడని అన్నారు. రాజకీయాల్లో నారా లోకేష్ ఒక కమెడియన్ అని, ఇది వరకు అడ్డంగా ఉండే లోకేష్ ఇప్పుడు కొద్దిగా తగ్గాడంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు మతిస్థిమితం లేదని, ఉక్రెయిన్ చిక్కుకుని అవస్థలు పడుతున్న విద్యార్థులకు అభినందనలు చెప్పడమేంటని ప్రశ్నించారు. టీడీపీ క్యాడర్‌ కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక ముందస్తు ఎన్నికల నిర్వహణపైనా అచ్చెన్నకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ కనుమరుగడవం ఖాయం అన్నారు దేవాదాయ శాఖ మంత్రి.

Also read:

Viral: ఓరీ దేవుడో ఇదేం మొక్కుబడిరా బాబు..నెత్తిమీదే మంట పెట్టి.. పొంగల్‌ వండేస్తున్నారు..!

Russia Ukraine War: తల్లడిల్లుతున్న నవీన్ తల్లిదండ్రులు.. కడసారి చూపు కోసం కన్నీటిపర్యంతం..

Indian Student: ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి దుర్మరణం.. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu