AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నాన్నా.. లే నాన్నా.. లే’.. తండ్రి మృతదేహం వద్ద ఆరేళ్ల కూతురి ఆక్రందన.. కంటతడి పెట్టించిన ప్రమాదం

మహాశివరాత్రి పండుగ రోజున ఆ కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. పింఛన్ తీసుకునేందుకు బైక్ పై బయల్దేరిన వారిని రోడ్డు ప్రమాదం కబళించింది. తండ్రీ, కుమారుడిని పొట్టన పెట్టుకుంది. ద్విచక్రవాహనంపై..

‘నాన్నా.. లే నాన్నా.. లే’.. తండ్రి మృతదేహం వద్ద ఆరేళ్ల కూతురి ఆక్రందన.. కంటతడి పెట్టించిన ప్రమాదం
Medaram Accident
Ganesh Mudavath
|

Updated on: Mar 02, 2022 | 6:54 PM

Share

మహాశివరాత్రి పండుగ రోజున ఆ కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. పింఛన్ తీసుకునేందుకు బైక్ పై బయల్దేరిన వారిని రోడ్డు ప్రమాదం కబళించింది. తండ్రీ, కుమారుడిని పొట్టన పెట్టుకుంది. ద్విచక్రవాహనంపై ఓ వ్యక్తి.. తన కుమారుడు, కుమార్తె, బావమరిదితో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం(accident) జరిగింది. ఇటుక బట్టీలో పనిచేస్తూ జీవనం సాగించే వారి కుటుంబాల్లో తీరని వేదనకు మిగల్చింది. బైక్ పై వెళ్తున్న సమయంలో వేగంగా వస్తున్న కారు టైరు పంక్చరైంది. దీంతో అదుపు తప్పిన కారు.. డివైడర్ పై నుంచి దూకి, వీరి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ, కుమారుడు మృతి చెందారు. మరో ఇద్దరికి, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అచేతనంగా పడి ఉన్న తండ్రి వద్దకు ఆరేళ్ల కూతురు వెళ్లి.. ‘నాన్నా…లే నాన్నా.. లే’ అంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. నాన్నకు ఏమైందంటూ బోరున విలపించింది. పండగ రోజు సరదాగా గడిపేందుకు వచ్చి మృత్యువాత పడటాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా(Krishna district) కంచికచర్ల మండలంలోని గండేపల్లి గ్రామానికి చెందిన కృష్ణ పద్మారావు తెలంగాణ(Telangana) రాష్ట్రం నల్గొండ జిల్లా నేరేడుచర్లలోని ఇటుక బట్టీల్లో పని చేస్తున్నాడు. అతని బావమరిది కూడా వారితోనే ఉంటున్నాడు. వినయ్‌కి ప్రభుత్వ పింఛను వస్తోంది. ఈ క్రమంలో పింఛన్ తీసుకునేందుకు పద్మారావు, అతని కుమారుడు రోహన్‌, కుమార్తె లహరి, వినయ్‌ లు ద్విచక్రవాహనంపై గొల్లపూడి బయల్దేరారు. నక్కలంపేట క్రాస్‌ రోడ్డు సమీపంలోకి వచ్చే సరికి.. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు టైర్‌ పంక్చరైంది. దీంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌పై నుంచి వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో పద్మారావు అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు రోహన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. లహరి, వినయ్, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. అచేతనంగా పడి ఉన్న తండ్రి వద్దకు ఆరేళ్ల కూతురు వెళ్లి.. ‘నాన్నా…లే నాన్నా.. లే’ అంటూ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

Also Read

ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ప్రియురాలి దారుణ హత్య.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. వివరాలు సేకరిస్తున్న ఏపీ అధికారులు

IND vs SL: అదృష్టంతో నెట్టుకొస్తున్నావ్.. సిరీస్ ఓడితే అసలు కథ మొదలు: రోహిత్‌పై కోహ్లీ కోచ్ సంచలన కామెంట్స్