IND vs SL: అదృష్టంతో నెట్టుకొస్తున్నావ్.. సిరీస్ ఓడితే అసలు కథ మొదలు: రోహిత్‌పై కోహ్లీ కోచ్ సంచలన కామెంట్స్

Rohit Sharma Captaincy: విరాట్ కోహ్లీ కోచ్ రాజ్‌కుమార్ శర్మ రోహిత్ శర్మను కెప్టెన్ కూల్ అని అంటూనే, అదే సమయంలో కొన్ని చురకలు కూడా అంటించాడు.

IND vs SL: అదృష్టంతో నెట్టుకొస్తున్నావ్.. సిరీస్ ఓడితే అసలు కథ మొదలు: రోహిత్‌పై కోహ్లీ కోచ్ సంచలన కామెంట్స్
Virat Kohli Coach Rajkumar Sharma
Follow us

|

Updated on: Mar 02, 2022 | 2:10 PM

టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) తన కెప్టెన్సీని అద్భుతంగా ప్రారంభించాడు. మొదట అతను టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్, శ్రీలంక కూడా రోహిత్ బారి నుంచి తప్పించుకోలేకపోయాయి. రోహిత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఇప్పటి వరకు ఓడిపోలేదు. అతని వ్యూహాలకు నిరంతరం ప్రశంసలు అందుతున్నాయి. కాగా, రోహిత్ శర్మ కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ(Virat Kohli’s childhood coach) కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ చాలా ప్రశాంతమైన కెప్టెన్ అని, అయితే కెప్టెన్‌గా అతనికి సులువుగా సిరీస్‌లు లభించిన మాట వాస్తవమేనని రాజ్‌కుమార్ శర్మ(Rajkumar Sharma అన్నాడు. టీమ్‌ఇండియా సిరీస్‌ ఓడిపోవడంతో రోహిత్‌ శర్మకు అసలైన పరీక్ష మొదలవుతుందని రాజ్‌కుమార్‌ శర్మ పేర్కొన్నాడు.

ఇండియా న్యూస్‌తో రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ, ‘రోహిత్ శర్మ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. అయితే ఇది అతని కెప్టెన్సీకి ప్రారంభం మాత్రమే. సులువైన సిరీస్‌లను అందుకున్న రోహిత్ శర్మ అదృష్టవంతుడు. జట్టు ఓడిపోవడంతో ఆరోపణల పర్వం మొదలవుతుంది. టీమ్ ఇండియా ప్రదర్శన ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నామని, అయితే ఫలితం ప్రతికూలంగా వచ్చినప్పుడే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి’ అని చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మకు అసలు పరీక్ష ఎప్పుడు? కెప్టెన్‌, కోచ్‌లు తప్పులు చేస్తే చాలా ప్రశ్నలు తలెత్తుతాయని రాజ్‌కుమార్‌ శర్మ అన్నాడు. రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ.. ‘కెప్టెన్‌, కోచ్‌లు తప్పులు చేస్తే చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. మీ వ్యూహం తప్పని అంటారు. ఆ నంబర్‌కు ఆ ప్లేయర్‌ని పంపించాల్సింది కాదని సూచనలు ఇస్తారు. ఐదుగురు కాదు, నలుగురు బౌలర్లను ఆడించాలని అంటారు. ఇలాంటి పరిస్థితి రాకూడదని ప్రార్థిస్తున్నాను. టీం ఇండియా వరుస మ్యాచ్‌లు గెలుస్తూ ప్రపంచకప్‌ను కూడా కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నాను’ అని తెలిపాడు.

గంగూలీ బాటలో రోహిత్ శర్మ.. రోహిత్ శర్మ సరిగ్గా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాటలోనే నడుస్తున్నాడని రాజ్ కుమార్ శర్మ అన్నాడు. దాదాలాగే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని సృష్టించాడు. రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ, ‘రోహిత్ శర్మ ప్రతి యువ ఆటగాడికి మంచి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని నిర్వహిస్తున్నాడు. నువ్వు తెలివైనవాడివి, కాబట్టి టీమిండియాకు చేరుకున్నావు అంటూ యువతకు రోహిత్ శర్మ భరోసా ఇస్తున్నాడు. ఒక యువ ఆటగాడు మంచి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. రోహిత్ శర్మ ఈ ప్రాక్టీస్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇది గంగూలీ కెప్టెన్సీలో ప్రారంభమైందని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు.

Also Read: ఇదేం బ్యాటింగ్‌రా సామీ.. 22 బంతుల్లో 8 సిక్సులు, 3 ఫోర్లు.. 309 స్ట్రైక్‌రేట్‌తో సునీల్ నరైన్ ఊచకోత

5 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు.. మూడు ఇన్నింగ్స్‌ల్లో 3 సార్లు 5 వికెట్లు, ఇందులో ఓ హ్యాట్రిక్.. అయినా బీసీసీఐ కరుణించట్లే