ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ప్రియురాలి దారుణ హత్య.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ప్రియురాలి దారుణ హత్య.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
Wife Murder

ఆమెతో పరిచయమై నాలుగేళ్లు అయింది. ఆ పరిచయం వారిద్దరి మధ్య సాన్నిహత్యంగా మారింది. వారిద్దరూ కలిసి ఓ హోటల్ కు వెళ్లారు. గదిలో ఉన్న సమయంలో మహిళకు నిరంతరాయంగా..

Ganesh Mudavath

|

Mar 02, 2022 | 6:01 PM

ఆమెతో పరిచయమై నాలుగేళ్లు అయింది. ఆ పరిచయం వారిద్దరి మధ్య సాన్నిహత్యంగా మారింది. వారిద్దరూ కలిసి ఓ హోటల్ కు వెళ్లారు. గదిలో ఉన్న సమయంలో మహిళకు నిరంతరాయంగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎవరు ఫోన్(Phone) చేస్తున్నారని అడగగా.. తన సోదరుడని సమాధానం చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. విచక్షణ కోల్పోయిన అతను.. ఆ మహిళ తలను నేలకేసి కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి(Death) చెందింది. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో(Delhi) జరిగింది. ఉత్తర్​ప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన శివమ్​ చౌహాన్​కు, ఢిల్లీ వసంత్​కుంజ్​లోని కిశన్​గఢ్​ప్రాంతానికి చెందిన మహిళతో సంబంధం ఉంది. ఈ క్రమంలో వీరిరువురూ గత శుక్రవారం ఓ హోటల్ కు వెళ్లారు.

మరుసటి రోజున శివమ్ ఒక్కడే బయటకు వెళ్లిపోవడంతో హోటల్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. వారు బస చేసిన గదిని పరిశీలించారు. ఆ గదిలో శివమ్ తో పాటు వచ్చిన మహిళ మృతి చెంది ఉండటాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ రికార్డులను పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టి.. ఉత్తర్​ప్రదేశ్​లోని మితౌలీ ప్రాంతంలో అరెస్టు​చేశారు. తనను మోసం చేసిన వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేక పోయానని శివమ్ అన్నాడు. తాము హోటల్ లో ఉండగా ఆ వ్యక్తి నుంచి ఆమెకు చాలా సార్లు ఫోన్ వచ్చిందని, ఎవరని అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపాడు. దీంతో తీవ్ర కోపంతో తలను నేలకేసి బలంగా కొట్టి చంపానని, హత్య జరిగిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయానని పోలీసుల విచారణలో శివమ్ అన్నాడు.

Also Read

Andhra Pradesh: ఉద్యోగులపై అచ్చెన్న సంచలన కామెంట్స్.. ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చిన మంత్రి వెల్లంపల్లి..

Shriya Saran: ఆస్పత్రిలో శ్రియా భర్త.. కూతురును కూడా ఎత్తుకోలేకపోయాడంటూ ఎమోషనల్‌.. ఇంతకీ ఆండ్రీకి ఏమైందంటే..

Praggnanandhaa: ఈ టీనేజ్ విజయానికి హైపిచ్చే బదులు.. మరింత ఎదిగేందుకు సహాయం చేయాలి: జీఎం శ్రీరాం జా

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu