Shriya Saran: ఆస్పత్రిలో శ్రియా భర్త.. కూతురును కూడా ఎత్తుకోలేకపోయాడంటూ ఎమోషనల్‌.. ఇంతకీ ఆండ్రీకి ఏమైందంటే..

Shriya Saran: ఆస్పత్రిలో శ్రియా భర్త.. కూతురును కూడా ఎత్తుకోలేకపోయాడంటూ ఎమోషనల్‌..  ఇంతకీ ఆండ్రీకి ఏమైందంటే..
Shriya Saran

శ్రియా శరణ్‌.. అందం, అభినయంతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇష్టంతో కెరీర్‌ను ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ అగ్రనటులతో పాటు యువ హీరోలతోనూ ఆడిపాడింది

Basha Shek

|

Mar 02, 2022 | 4:43 PM

శ్రియా శరణ్‌.. అందం, అభినయంతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇష్టంతో కెరీర్‌ను ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ అగ్రనటులతో పాటు యువ హీరోలతోనూ ఆడిపాడింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ మలయాళ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం చూరగొంది. సినిమాలు చేస్తుండగానే రష్యన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఆండ్రీ కొశ్చీవ్‌తో ప్రేమలో పడిన శ్రియ (Shriya)  2018లో అతనితో కలిసి పెళ్లిపీటలెక్కింది. తమ ప్రేమ బంధానికి గుర్తుగా తనకు 9 నెలల కూతురు ఉన్నట్లు గతేడాది చివరిలో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. వివాహమయ్యాక సినిమాలు తగ్గించుకున్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది శ్రియ. తన గ్లామరస్, ఫ్యాషనబుల్‌ ఫొటోలతో పాటు భర్తతో దిగిన రొమాంటిక్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే తన భర్త ఆండ్రీ (Andrei Koscheev) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచిందీ అందాల తార. హెర్నియాతో బాధపడుతున్న ఆండ్రీకి ఇటీవల అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. తాజాగా ఈ సర్జరీ విజయవంతం కావడంతో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఉపాసనకు థ్యాంక్స్‌..!

ఆస్పత్రిలో చేతికి బ్యాండేజీలతో ఉన్న ఆండ్రీ ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘అనారోగ్య సమస్య కారణంగా నా భర్త సుమారు రెండు నెలల పాటు మా కూతురు రాధను కూడా ఎత్తుకోలేకపోయాడు. ఇప్పుడతను కోలుకుంటున్నాడు. నా భర్తకు మంచి చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు. ఆండ్రీ రికవరీలో సాయపడిన అపోలో ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌తో పాటు ఉపాసన కొణిదెల, డాక్టర్‌ రజనీష్‌ రెడ్డికి కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చింది శ్రియ. కాగా శ్రియా పోస్ట్‌పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. అంతా సవ్యంగానే జరిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని మెగా కోడలు ఉపాసన రిప్లై ఇచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది గమనంలో డీసెంట్‌ హిట్ అందుకున్న శ్రియ త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో మళ్లీ మన ముందుకు వస్తోంది. దీంతో పాటు మ్యూజిక్‌ స్కూల్, దృశ్యం2, తడ్కా (హిందీ), నాగసూరన్‌, సందకారి (తమిళ్‌) సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది.

Also Read:Andhra Pradesh: చెప్పుతో కొట్టుకున్న వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.. రీజన్ ఇదే

Shocking Video: ఉక్రెయిన్‌లో ఆగని రష్యా దాడులు.. పోలీస్ కార్యాలయంపై క్షిపణి దాడి.. షాకింగ్ వీడియో

Russia Ukraine War: ఉక్రెయిన్‌ నాశనానికి రష్యా బ్రహ్మాస్త్రం.. వాక్యూమ్ బాంబ్ అంటే ఏమిటి?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu