AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej Ghani: వరుణ్‌ పంచ్‌ విసిరేది అప్పుడే.. మండు వేసవిలో ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్న గని..

Varun Tej: మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ మెగా హీరోతో రొమాన్స్‌ చేయనుంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో వరుణ్‌ తేజ్ (Varun Tej)  ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించనున్నాడు.

Varun Tej Ghani: వరుణ్‌ పంచ్‌ విసిరేది అప్పుడే.. మండు వేసవిలో ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్న గని..
Ghani Movie
Basha Shek
|

Updated on: Mar 02, 2022 | 3:30 PM

Share

Varun Tej: మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ మెగా హీరోతో రొమాన్స్‌ చేయనుంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో వరుణ్‌ తేజ్ (Varun Tej)  ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అల్లు అరవింద్‌ (Allu Aravind) సమర్పణలో సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కాగా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఫిబ్రవరి 25న గని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించినా పవన్‌ కల్యాణ్‌ భీమ్లా నాయక్‌ రిలీజ్‌ నేపథ్యంలో మళ్లీ వెనక్కు తగ్గారు. ఈ క్రమంలో తాజాగా గని కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది చిత్ర బృందం. ఏప్రిల్‌ 8న తమ సినిమాను విడుదల చేస్తున్నట్లు గీతా ఆర్ట్స్‌ సంస్థ అధికారికరంగా వెల్లడించింది.

కాగా ‘గని’ సినిమాలో వరుణ్‌ కోచ్‌గా బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో సునీల్‌ శెట్టి కనిపించనున్నారు. ఆయనతో పాటు ఉపేంద్ర, జగపతి బాబు, నదియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటివరకు ప్రేమకథా చిత్రాలతో మెప్పించిన మెగాప్రిన్స్‌ తొలిసారిగా బాక్సర్ గా కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే గని సినిమా కోసం బాగా కష్టపడ్డాడు వరుణ్ తేజ్. బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేశాడు. మరి మండు వేసవిలో రానున్న ఈ మెగా సినిమా ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో లెట్స్‌ వెయిట్‌ అండ్ సీ..

Also Read:Praggnanandhaa: ఈ టీనేజ్ విజయానికి హైపిచ్చే బదులు.. మరింత ఎదిగేందుకు సహాయం చేయాలి: జీఎం శ్రీరాం జా

PM Narendra Modi: స్టార్టప్ రంగానికి అండగా నిలుస్తాం.. సాంకేతికతకు పెద్దపీట వేస్తాం.. త్వరలో 5జీ స్పెక్ట్రమ్ వేలం..

Radhe Shyam: ప్రేమకు, విధికి మధ్య జరిగే యుద్ధం.. అంచనాలు పెంచేసిన రాధేశ్యామ్ రిలీజ్ ట్రైలర్..