Shocking Video: ఉక్రెయిన్‌లో ఆగని రష్యా దాడులు.. పోలీస్ కార్యాలయంపై క్షిపణి దాడి.. షాకింగ్ వీడియో

Russia Ukraine War News: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర కొనసాగుతోంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో పరిస్థితి దారుణంగా మారుతోంది. జనావాసాలపైనా బాంబులతో రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి.

Shocking Video: ఉక్రెయిన్‌లో ఆగని రష్యా దాడులు.. పోలీస్ కార్యాలయంపై క్షిపణి దాడి.. షాకింగ్ వీడియో
War In Ukraine
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 02, 2022 | 4:03 PM

Russia Ukraine War News: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర కొనసాగుతోంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో పరిస్థితి దారుణంగా మారుతోంది. జనావాసాలపైనా బాంబులతో రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఎటాక్స్‌ ఒక లెక్క… ఇప్పట్నుంచి జరగబోయే ఎటాక్స్‌ మరో లెక్క అంటూ బాంబుల మోత మోగిస్తోంది. రష్యా దాడులతో ఖర్కివ్‌ నగరం గజగజ వణికిపోతోంది. ఖర్కివ్ నగరంలోని పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రాంతీయ కార్యాలయంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 21 మంది మృతి చెందగా, 112 మంది గాయపడినట్లు ఖర్కివ్ నగర మేయర్ తెలిపారు. రష్యా క్షిపణి దాడిలో పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రాంతీయ కార్యాలయం తగలబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇతర మంత్రులు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఉక్రెయిన్‌‌ను సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో రష్యా దాడులు చేస్తోందని ఆ దేశ ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. అమాయక పౌరులు కూడా రష్యా దాడుల్లో బలైపోతున్నారని ఉక్రెయిన్ ఇప్పటికే ఆరోపణలు చేయడం తెలిసిందే.

ఉక్రెయిన్‌లో బిక్కుబిక్కుమంటున్న భారతీయ విద్యార్థులు..

దాంతో, అక్కడున్న ఇండియన్స్‌ అంతా బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.  ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇండియన్స్‌ను సేఫ్‌గా తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది కేంద్రం. స్టూడెంట్స్‌తో సంప్రదింపులు జరుపుతూ ఉక్రెయిన్‌ బోర్డర్‌కు విమానాలను పంపుతోంది. కానీ, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో చిక్కుకుపోయిన ఇండియన్స్‌ బోర్డర్‌ దాటేదెలా? అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. కన్నడ స్టూడెంట్‌ నవీన్‌ మృతితో పేరెంట్స్‌ గుండెల్లో దడ మొదలైంది. తమ పిల్లలకు ఏం జరుగుతుందోనని వారి తల్లిదండ్రులు భయపడుతున్నారు.

ఉక్రెయిన్‌లో 20వేల మంది ఇండియన్స్‌ ఉన్నారన్నది భారత విదేశాంగ అంచనా. అయితే, ఈ 20వేల మందిలో 60శాతం వచ్చేశారని చెబుతోంది. అంటే, 12వేల మంది ఉక్రెయిన్‌ను వీడారని అంటోంది. ఇక, మిగిలింది కేవలం 8వేల మందేనని, వాళ్లందరినీ సేఫ్‌గా తరలిస్తామంటోంది కేంద్రం.

Also Read..

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో గెలుపు ఎవరిది..? ముందే చెప్పేసిన బాబా వెంగా..

PM Narendra Modi: స్టార్టప్ రంగానికి అండగా నిలుస్తాం.. సాంకేతికతకు పెద్దపీట వేస్తాం.. త్వరలో 5జీ స్పెక్ట్రమ్ వేలం..