AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: తల్లడిల్లుతున్న నవీన్ తల్లిదండ్రులు.. కడసారి చూపు కోసం కన్నీటిపర్యంతం..

అక్కడ దండయాత్ర.. ఇక్కడ గుండెకోత.. ఉక్రెయిన్‌పై రష్యా(Russia Ukraine War) నిప్పుల వానకు కన్నడవాసి నవీన్‌ శేఖరప్ప(Naveen) చనిపోవడంతో కుటుంబమంతా కన్నీరుమున్నీరవుతోంది...

Russia Ukraine War: తల్లడిల్లుతున్న నవీన్ తల్లిదండ్రులు.. కడసారి చూపు కోసం కన్నీటిపర్యంతం..
Naveen
Srinivas Chekkilla
|

Updated on: Mar 02, 2022 | 5:41 PM

Share

అక్కడ దండయాత్ర.. ఇక్కడ గుండెకోత.. ఉక్రెయిన్‌పై రష్యా(Russia Ukraine War) నిప్పుల వానకు కన్నడవాసి నవీన్‌ శేఖరప్ప(Naveen) చనిపోవడంతో కుటుంబమంతా కన్నీరుమున్నీరవుతోంది. నవీన్ ఇకలేడని, ఇకరాడని కన్నీటిపర్యంతమవుతున్నారు. చివరికి ఆఖరి చూపైనా దక్కుతుందా..? మృతదేహాం(Naveen Dead body) ఎప్పుడు వస్తుందన్న ఆశతో కుటుంబమంతా ఎదురుచూస్తోంది. వాళ్లను ఓదార్చడం ఎవరి వల్లా కావడంలేదు. నవీన్ తల్లి రోధిస్తోంది.. నాన్న చిన్నపిల్లాడిలా గుక్కపట్టి ఏడుస్తున్నాడు. సోదరుడికి కంటిమీద కునుకు లేకుండాపోయింది. కుటుంబం ఆశంతా ఒక్కటే.. నవీన్‌ను కడసారైనా చూడాలని. పరామర్శకు వచ్చే నేతలందర్నీ అదే అడుగుతున్నారు. వాళ్ల విఙ్ఞప్తులు చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది.

ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ చిక్కుకున్న వందలాది మంది విద్యార్థుల్ని సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అంతలోనే అనుకోని విషాదం అందర్నీ కంటతడి పెట్టించింది. నవీన్ చనిపోయాడనే వార్తతో కర్టాటకలోని హావేరి జిల్లా చెళగెరె గ్రామం గుండె చెరువైంది. నవీన్ చూపైనా దక్కుతుందా? లేదా అనేది అనుమానంగానే ఉంది. ప్రస్తుతానికైతే బాడీ భద్రంగానే ఉందనే అధికారులు చెబుతున్నారు. కానీ ఎప్పుడు స్వదేశానికి తీసుకొస్తారన్నది మాత్రం చెప్పడం లేదు.

వైద్య వృత్తి చేపట్టి ఊరికి సేవలందిస్తాడని భావించింది నవీన్ కుటుంబం. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదంటూ కన్నీరుమున్నీరవుతోంది. నవీన్ కుటుంబ సభ్యులతో ఇప్పటికే ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. నవీన్ కుటుంబసభ్యుల్ని ఊరు ఊరంతా ఓదారుస్తోంది. ధైర్యం చెబుతోంది. వాళ్లంతా ఒకటే కోరుకుంటున్నారు. నవీన్‌ను కడసారి చూడాలి.. సాధ్యమైనంత త్వరగా బాడీని తీసుకురావాలని.

Read  Also.. Shocking Video: ఉక్రెయిన్‌లో ఆగని రష్యా దాడులు.. పోలీస్ కార్యాలయంపై క్షిపణి దాడి.. షాకింగ్ వీడియో