AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: తక్షణమే ఖార్కివ్ నుండి బయటపడండి.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ గంటలో రెండో ఆదేశం!

ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో పరిస్థితి క్లిష్టంగా మారింది. రష్యా సైన్యం నిరంతరం ఈ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది.

Russia Ukraine War: తక్షణమే ఖార్కివ్ నుండి బయటపడండి.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ గంటలో రెండో ఆదేశం!
Indians
Balaraju Goud
|

Updated on: Mar 02, 2022 | 6:33 PM

Share

Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో పరిస్థితి క్లిష్టంగా మారింది. రష్యా సైన్యం నిరంతరం ఈ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. ఇదిలావుండగా, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం గంట వ్యవధిలో రెండవ సలహాను జారీ చేసింది. అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులు వెంటనే ఖార్కివ్ వదిలివేయాలని కోరింది. రైళ్లు, బస్సులు దొరకని, రైల్వే స్టేషన్‌లో ఉన్న విద్యార్థులందరూ కాలినడకన పెసోచిన్, బాబాయే, బెజ్లియుడోవ్కాకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఖార్కివ్ నుండి పెసోచిన్ వరకు దూరం 11 కిలోమీటర్లు, బాబాయే నుండి దూరం 12 కిలోమీటర్లు, బెజ్లియుడోవ్కా నుండి దూరం 16 కిలోమీటర్లు. ప్రస్తుతం ఖార్కివ్‌లో ఎట్టిపరిస్థితుల్లో ఉండవద్దని భారత రాయబార కార్యాలయం సూచించింది.

భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేసింది. “ఎట్టి పరిస్థితుల్లోనూ, వారు ఈ రోజు ఉక్రెయిన్ సమయం ప్రకారం 6 గంటలకు ఈ ప్రదేశాలకు చేరుకోవాలి. ఖార్కివ్‌లోని భారతీయులందరూ తమ స్వంత భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఖార్కివ్‌ను విడిచిపెట్టి, పెసోచిన్, బాబాయే, బెజ్లియుడోవ్కాకు వీలైనంత త్వరగా చేరుకోవడం చాలా ముఖ్యం అని రాయబార కార్యాలయం ఇంతకు ముందు పేర్కొంది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఉధృతం చేసింది. ఏకంగా పలు కీలక నగరాలపై వైమానిక దాడులకు తెగబడుతోంది రష్యా సైన్యం. ఈ కారణంగా తూర్పు యూరోపియన్ దేశంలో పరిస్థితి మరింత దిగజారుతున్న తరుణంలో ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ సలహా ఇచ్చింది. ముఖ్యంగా ఖార్కివ్‌పై దాడులు తీవ్రమవుతున్నట్లు సమాచారం.

ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లోని ప్రాంతీయ పోలీసు ప్రధాన కార్యాలయం, ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. భవనం పైకప్పు ఎగిరిపోయి దాని పై అంతస్తుకు నిప్పంటుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలావుంటే, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ పౌరులను తిరిగి తీసుకురావడానికి భారత్ ‘ఆపరేషన్ గంగా’ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా ఉక్రెయిన్‌ నుంచి ల్యాండ్‌ బోర్డర్‌ పోస్టుల ద్వారా హంగేరీ, రొమేనియా, పోలాండ్‌, స్లోవేకియా నుంచి విమానాల్లో భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. Read Also… Russia Ukraine War: తల్లడిల్లుతున్న నవీన్ తల్లిదండ్రులు.. కడసారి చూపు కోసం కన్నీటిపర్యంతం..