- Telugu News Photo Gallery Political photos Russia Ukraine Crisis: West Godavari officials collecting information about students stuck in ukraine
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. వివరాలు సేకరిస్తున్న ఏపీ అధికారులు
ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం ఏపీ ప్రతినిధులు పోలీండ్, హంగేరికి వెళ్లనున్నారు. విద్యార్థుల తరలింపు కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
Updated on: Mar 02, 2022 | 5:11 PM

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను తీసుకువచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించాలని జిల్లా అధికారులకు కేంద్ర విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక అధికారులతో సహాయంతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు.

కవిటి మండలం కొజ్జిరియా గ్రామానికి చెందిన పనపన బాల్‌రాజ్ రెడ్డిని ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. కవిటి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్.. కవిటిలోని బాల్‌రాజ్ రెడ్డి తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థి బోడ బాలకృష్ణ కుమారుడు లోకేష్ ను తిరిగి స్వంతూరుకు సురక్షితంగా తీసుకువస్తామని అధికారులు తెలిపారు. కంచిలి గ్రామ రెవెన్యూ అధికారి లోకేష్ తల్లిదండ్రులతో కలిసి మాట్లాడారు. కంచిలిలోని బలియపుట్టుగ కాలనీలో నివాసం ఉండే కుటుంబసభ్యులను కలిసి పూర్తి వివరాలను సేకరించారు.

రణస్థలం డిప్యూటీ తహశీల్దార్.. జీరుకొవ్వాడ గ్రామానికి చెందిన గొర్లె భార్గవ్ నాయుడు తల్లిదండ్రులను కలుసుకున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థిని తీసుకువస్తామని కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న సోంపేట మండలం తాళ్లభద్ర గ్రామానికి చెందిన బేసి ఉదయ్ కిరణ్ తల్లిదండ్రులను ప్రభుత్వ అధికారులు కలుసుకున్నారు. సోంపేట మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వారితో మాట్లాడారు.

ఇచ్చాపురం మండలం యడం శ్వేత మిస్ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. ఇచ్ఛాపురం తహశీల్దార్ శ్వేత ఇంటికి వెళ్లి, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. త్వరలోనే శ్వేతను సురక్షితంగా తీసుకువస్తామని భరోసా కల్పించారు.

కోటబొమ్మాళి మండలం లకమిడ్డి గ్రామానికి చెందిన మెట్ట వాసుదేవ రావు కుటుంబసభ్యుల కోటబొమ్మాళి తహశీల్దార్ నూక పార్వతి మాట్లాడారు. వాసుదేవరావు కుటుంబం గుజరాత్ రాష్ట్రంలోని రాజులా జిల్లాకు తాత్కాలికంగా వలస వెళ్లిందని తెలుసుకున్నారు. వాసుదేవ రావు కుటుంబానికి లకమిడిడ్డి గ్రామంలో కనీసం ఇళ్లు కూడా లేదని తహశీల్దార్ గుర్తించారు.

ఉక్రెయిన్‌లో ఉండిపోయిన వానంగి గ్రామానికి చెందిన సూర్యనారాయణ సత్రం కుమారుడు వరప్రసాద్‌కు సంబంధించిన వివరాలను మండల అధికారులు సేకరించారు. తహశీల్దార్ వినోద మండల్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ఉండిపోయిన వానంగి గ్రామానికి చెందిన సూర్యనారాయణ సత్రం కుమారుడు వరప్రసాద్‌కు సంబంధించిన వివరాలను మండల అధికారులు సేకరించారు. తహశీల్దార్ వినోద మండల్ కుటుంబసభ్యులతో మాట్లాడారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కుటుంబసభ్యులతో రెవిన్యూ అధికారులు కలుసుకుని భరోసా కల్పిస్తున్నారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి కేంద్ర విదేశాంగ అధికారులకు నివేదిక పంపించనున్నారు.
