Pawan Kalyan: ‘నేను అప్పుడు మాత్రమే యుద్ధం చేస్తాను’.. జనసేనాని తాజా పోస్ట్ వైరల్
పవన్ ఎక్కువగా పుస్తకాలు చదువుతారన్న విషయం తెలిసిందే. పలు పుస్తకాలు తనను కదిలించిన సందర్భాలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ ప్రభావం పవన్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
Janasena: పవర్‌లో లేని తనను పవర్ స్టార్ అని పిలవొద్దు అని టాలీవుడ్ హీరో, జనసేనాని పవన్ కల్యాణ్ పలుమార్లు ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేశారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఆయన్ను అలానే పిలిచేందుకు ఇష్టపడతారు. ఇటీవలే భీమ్లా నాయక్(Bheemla Nayak) మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు పవన్ కల్యాణ్. వరుసగా మూవీస్ అనౌన్స్ చేసిన పవన్.. ఆయా సినిమాల షూటింగ్స్‌తో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు కూడా సమయాన్ని కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏపీ(Andhra Pradesh)లో టికెట్ రేట్ల గురించి అటు పవన్ మద్దతుదారులకు, వైసీపీ నేతలకు మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే పవన్ ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. అందులో ఏదో రాస్తున్నట్లు కనిపిస్తున్నారు పవన్. ‘ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభై తొమ్మిది సార్లు శాంతియుతంగా ప్రయత్నిస్తాను, నూరనసారి మాత్రమే యుద్ధం చేస్తాను’ అన్న కొటేషన్ ఆ పోస్ట్‌లో రాసి ఉంది.
— Pawan Kalyan (@PawanKalyan) March 2, 2022
పవన్ ఎక్కువగా పుస్తకాలు చదువుతారన్న విషయం తెలిసిందే. పలు పుస్తకాలు తనను కదిలించిన సందర్భాలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ ప్రభావం పవన్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన పుస్తకంలోని ‘నేనంతా పిడికెడు మట్టే కావొచ్చు.. కానీ తల ఎత్తితే దేశపు జెండాకి ఉన్నంత పొగరు ఉంది’ అన్న కొటేషన్‌ను జనసేనాని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. పవన్ స్పీచుల్లోనూ, ఆయన మాటల్లోనూ ఈ ధోరణే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా పవన్ పెట్టిన ట్విట్టర్ పోస్ట్‌లోని కొటేషన్ సైతం ఎంతో లోతైన అర్థాన్ని పంపుతుంది.
Also Read: వాహనం ఆపగా కదులుతూ కనిపించిన గోనె సంచులు.. తనిఖీ చేసిన పోలీసులు షాక్
చెవి నొప్పితో ఆస్పతికి వెళ్లిన మహిళ.. అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. తెల్లారేసరికి ఊహించని షాక్