Hyderabad: చెవి నొప్పితో ఆస్పతికి వెళ్లిన మహిళ.. అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. తెల్లారేసరికి ఊహించని షాక్

నగరంలో నివశించే ఓ మహిళ చెవి నొప్పి కాస్త ఎక్కువగా ఉండడంతో గత నెల 27న ఆదివారం ఎల్బీనగర్‌లోని ఓ హాస్పిటల్‌కు వెళ్లారు. పలు రకాల టెస్టులు చేసిన డాక్టర్లు.. ఆమెకు ఆపరేషన్ చేయాలని చెప్పి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు.

Hyderabad: చెవి నొప్పితో ఆస్పతికి వెళ్లిన మహిళ.. అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. తెల్లారేసరికి ఊహించని షాక్
Representative image
Follow us

|

Updated on: Mar 02, 2022 | 3:44 PM

Lb Nagar: హైదరాబాద్‌‌లో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. చెవి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. బ్రెయిన్‌డెడ్‌కు గురైంది. ఆపరేషన్ కోసం ఇచ్చిన మత్తుమందు హైడోస్ అవ్వడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయి.. బ్రెయిన్‌డెడ్ అయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆస్పత్రి వర్గాలు.. ఆమె బ్రెయిన్‌డెడ్‌కు గురైన విషయం కుటుంబ సభ్యుల వద్ద దాచడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండటంతో.. అనుమానం వచ్చి బంధువులు అడగ్గా అప్పుడు వివరణ ఇచ్చారు. అనస్థీషియా(Anesthesia)కు ఆమె శరీరం సహకరించలేదని.. కోమాలోకి వెళ్లారని చెప్పుకొచ్చారు. దీంతో బంధువులు ఆస్పత్రికి యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళనకు దిగారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు..  వనస్థలిపురానికి(Vanasthalipuram) చెందిన వజ్రమ్మ(53) అబ్దుల్లాపూర్‌మెట్ గవర్నమెంట్ స్కూల్‌లో హిందీ పండిట్‌గా పనిచేస్తున్నారు. చెవి నొప్పి కాస్త ఎక్కువగా ఉండడంతో గత నెల 27న ఆదివారం ఎల్బీనగర్‌లోని ఓ హాస్పిటల్‌కు వెళ్లారు. పలు రకాల టెస్టులు చేసిన డాక్టర్లు.. ఆమెకు ఆపరేషన్ చేయాలని చెప్పి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. మరుసటి రోజు సోమవారం ఆమెకు సర్జరీ చేసే ముందు మత్తు మందు ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. మహిళ కుటుంబ సభ్యులకు విషయం చెప్పకుండా డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి ట్రీట్మెంట్ అందించారు.

అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశ్నించడంతో మొత్తం వ్యవహారం వెలుగుచూసింది. ఆమె శరీరం మత్తు మందుకు సహకరించలేదని.. కోమాలోకి వెళ్లిపోయిందని చెప్పడంతో.. కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్తు మందు హైడోస్ ఇవ్వడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయిందని.. బ్రెయిన్‌డెడ్ అయిందని చెబుతున్నారని ఆందోళనకు దిగారు. చెవి నొప్పని వస్తే..  బ్రెయిన్‌డెడ్ చేశారని నిరసనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు.

Also Read: వాహనం ఆపగా కదులుతూ కనిపించిన గోనె సంచులు.. తనిఖీ చేసిన పోలీసులు షాక్