మంచి ఎవరు చెప్పినా ఈ సీఎం వినడు: చంద్రబాబు

మాజీ సీఎం చంద్రబాబు.. ఏపీ సీఎం జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజులుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నానని.. పరాయి గ్రామంలో అజ్ఞాత వాసిగా బతుకుతున్నానని వ్యాఖ్యానించారు. బంధువులు చనిపోతే ఊరికెళ్ళాలంటే.. పోలీసుల రక్షణ ఉండాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు. నా రాజకీయ జీవితంలో ఇంత నీచమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. పిచ్చ పిచ్చగా చేస్తే.. తిరిగి చేసే సత్తా టీడీపీకి ఉందన్నారు. వంద రోజుల్లో ఐదు వందల దాడులతో.. సీఎం […]

మంచి ఎవరు చెప్పినా ఈ సీఎం వినడు: చంద్రబాబు
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2019 | 7:37 PM

మాజీ సీఎం చంద్రబాబు.. ఏపీ సీఎం జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజులుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నానని.. పరాయి గ్రామంలో అజ్ఞాత వాసిగా బతుకుతున్నానని వ్యాఖ్యానించారు. బంధువులు చనిపోతే ఊరికెళ్ళాలంటే.. పోలీసుల రక్షణ ఉండాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు. నా రాజకీయ జీవితంలో ఇంత నీచమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. పిచ్చ పిచ్చగా చేస్తే.. తిరిగి చేసే సత్తా టీడీపీకి ఉందన్నారు.

వంద రోజుల్లో ఐదు వందల దాడులతో.. సీఎం జగన్ గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కారన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన వారిని వేధిస్తున్నారని.. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామన్నారు. ఇది రౌడీ రాజ్యమని, రాక్షస రాజ్యమని ఘాటుగా విమర్శించారు. ఇటువంటి ముఖ్యమంత్రులను చాలా మందిని చూశానని.. మంచి ఎవరు చెప్పినా ఈ సీఎం వినడని అన్నారు. ముర్ఖత్వంతోనే ప్రజా వేదికను కూల్చారని.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల జోలికొస్తే వదిలిపెట్టనని విమర్శించారు. ఇటువంటి వారిని ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టాలని.. వంద రోజుల నుండి బయట ఉంటున్న కార్యకర్తల ఒక్కో కుటుంబానికి పదివేలు ఇస్తానని తెలిపారు చంద్రబాబు.