పవన్ ఆనందించదగ్గ విషయమే.. కానీ పలకడేమీ..!

పవన్ ఆనందించదగ్గ విషయమే.. కానీ పలకడేమీ..!

పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పరిపాలన సాగిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆశావర్కర్లకు జీతాలను పెంచడం.. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం.. వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న జగన్.. మంగళవారం ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ బాధితుల కోసం పలాసలో200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 04, 2019 | 1:52 PM

పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పరిపాలన సాగిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆశావర్కర్లకు జీతాలను పెంచడం.. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం.. వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న జగన్.. మంగళవారం ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ బాధితుల కోసం పలాసలో200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి జగన్ పచ్చజెండా ఊపారు. ఈ మేరకు జీవో పాస్ చేసిన జగన్ ప్రభుత్వం.. ఆసుపత్రికి అనుసంధానంగా రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఇందుకోసం మొత్తం రూ.50కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. దీంతో జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై కిడ్నీ రోగులు, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంకా స్పందించకపోవడం విశేషం. నిజానికి చెప్పాలంటే ఉద్దానం సమస్య తీవ్రతను ప్రభుత్వానికి, ప్రజలకు తెలిసేలా చేసింది పవన్ కల్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన పవన్.. అప్పుడే ఉద్దానం సమస్యను పరిష్కరించాలంటూ బాధితుల పక్షాన నిలబడ్డారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో పర్యటించి.. సమస్యను అవగాహన చేసుకొని.. వారికి అండగా నిలుస్తానని హామీ కూడా ఇచ్చారు. దీనికి అనుగుణంగానే అప్పటి సీఎం చంద్రబాబుతో సైతం చర్చలు జరిపారు. అంతేకాదు ఈ సమస్యపై నిర్దిష్ట గడువులోగా ప్రభుత్వం స్పందించాలని హెచ్చరించిన ఆయన.. దీక్షకు సైతం సిద్ధమయ్యారు. అయితే అప్పటిలోపే చంద్రబాబు స్పందించడం.. సమస్యను పరిష్కరిస్తామని పవన్‌కు హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష ప్రతిపాదనను విరమించుకున్నారు.

ఇక ఆ తరువాత నాటి ఆరోగ్య శాఖా మంత్రి కామినేనితో కలిసి కిడ్నీ సమస్య పరిష్కారానికి తన కృషిని మరింత ముమ్మరం చేశారు. అంతేకాకుండా అమెరికాలో జరిపిన తన పర్యటనలో సైతం ఉద్దానం కిడ్నీ సమస్యను ప్రస్తావించారు. విదేశీ నిపుణులతో ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సంగతి తెలిసిందే. పవన్ చూపిన చొరవ వల్ల నాటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కిడ్నీ బాధితుల కోసం ఆసుపత్రుల్లో వార్డులు సైతం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కిడ్నీ సమస్య ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద మంచి నీటిని సరఫరా చేయడం, మూడు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. అయితే శాశ్వత ప్రతిపాదిక చర్యలు తీసుకోవడానికి ఎన్నికల తరుణం ముంచుకురావడంతో పవన్.. ముందుకు కదలలేక పోయారు. తాజాగా ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ సమస్యను తీర్చే దిశగా ముందడుగు వేసింది. ఇదిలా ఉంటే రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి తలెత్తిన అనిశ్చితిపై స్పందించిన పవన్.. తానే మొదట చొరవ చూపిన ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబాల పట్ల జగన్ తీసుకున్న చర్యపై నోరెత్తకపోవడం శోచనీయం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu