మిస్టరీగా వివేకా మర్డర్: లేఖల చుట్టూ తిరుగుతున్న హత్య కేసు..!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపడుతున్నా.. కేసు మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. అయితే.. తాజాగా ఈ కేసులో నిందితుడు అయిన శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అతను రాసిన సూసైడ్ నోట్ చర్చనీయంశంగా మారింది. శ్రీనివాస్ రెడ్డి రాసినట్లుగా చెబుతున్న రెండు లేఖలు ఇప్పుడు పోలీసులకు కీలక ఆధారాలుగా మారాయి. లేఖల్లో హ్యాండ్ రైటింగ్ వేర్వేరుగా ఉండడం అనేక అనుమానాలను […]

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపడుతున్నా.. కేసు మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. అయితే.. తాజాగా ఈ కేసులో నిందితుడు అయిన శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అతను రాసిన సూసైడ్ నోట్ చర్చనీయంశంగా మారింది. శ్రీనివాస్ రెడ్డి రాసినట్లుగా చెబుతున్న రెండు లేఖలు ఇప్పుడు పోలీసులకు కీలక ఆధారాలుగా మారాయి. లేఖల్లో హ్యాండ్ రైటింగ్ వేర్వేరుగా ఉండడం అనేక అనుమానాలను రేకిత్తిస్తోంది. మరోవైపు డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా అర్ధరాత్రి హుటా హుటిన కడపకు బయలుదేరారు. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య నేపథ్యంలో కడపలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు.
వైఎస్ వివేకా హత్య కేసు అంతా ఇప్పుడు లేఖలు చుట్టూ తిరుగుతోంది. వివేకా హత్య సమయంలో లభ్యమైన లేఖతో పాటు.. తాజాగా శ్రీనివాస్ రెడ్డి రాసినట్టు చెబుతున్న రెండు లేఖలు ఈ కేసులో కీలకమయ్యాయి. చనిపోయే ముందు శ్రీనివాసరెడ్డి మూడు పేజీల లేఖ రాశాడు. అందులో ఒకటి సీఎం వైఎస్ జగన్ పేరుతో రాస్తే, మరొకటి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి రాశాడు. అయితే శ్రీనివాస్ రెడ్డి రాసినట్టు చెబతున్న రెండు లేఖల్లో చేతిరాత వేర్వేరుగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
కాగా.. గతంలో నిందితులకు నార్కో టెస్ట్ నిర్వహించినా ఎలాంటి నిజాలు బయటకు రాలేదు. ఈ కేసులో 5 లక్షల నుంచి 10 కోట్ల రూపాయల వరకు జరిగిన బ్యాంక్ లావాదేవీల అంతు తేల్చలేకపోయారు పోలీసులు. అయితే.. తాజాగా శ్రీనివాస్ రెడ్డి రాసిన రెండు లేఖలు.. పోలీసులు.. కీలక ఆధారాలుగా భావిస్తున్నారు. పోలీసులు ఈ రెండు లేఖలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అసలు లేఖలు రాసింది శ్రీనివాస్ రెడ్డేనా..? శ్రీనివాస్ రెడ్డి లేఖలు రాస్తే రెండు లేఖల్లో హ్యాండ్ రైటింగ్ వేర్వేరుగా ఎందుకు ఉంది..? శ్రీనివాస్ రెడ్డిది అసలు ఆత్మహత్యేనా…? ఇవన్నీ ఫోరెన్సిక్ నివేదికలో బయటపడనున్నాయి.
మరొక విషయం ఏంటంటే.. వైఎస్ మర్డర్ జరిగి ఇన్ని రోజులైనా.. ఇంతమందిని టెస్టులకు పంపినా..? కోర్టుల చుట్టూ తిప్పుతున్నా.. ఇంకా ఎందుకు.. అసలు నిజాలు బయటకు రావడంలేదు. వైఎస్ వివేకా నందరెడ్డి మృతిపై ఎన్ని రకాల సిట్‌లు వేసినా.. ఎంతమంది ఇన్వెస్టిగేట్ చేసినా.. మనుషులు మారుతున్నారే తప్పా.. నిజాలు మాత్రం బయటకు రావడంలేదు. చూడాలి.. మరి ఈ లేఖల ద్వారా ఫోరెన్సిక్ నివేదిక ఎలా రానున్నదో..!