AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS: గులాబీ గూటిలో అప్పుడే కుర్చీలాట.. నేనంటే నేనంటున్న తాజా.. మాజీలు..

గులాబీ గూటిలో అప్పుడే కుర్చీలాట మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు కనుచూపుమేరలో లేకున్నా ఫైటింగ్ మాత్రం అప్పుడే షురూ అయ్యింది.

TRS: గులాబీ గూటిలో అప్పుడే కుర్చీలాట.. నేనంటే నేనంటున్న తాజా.. మాజీలు..
Sridhar Prasad
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 06, 2021 | 2:42 PM

Share

గులాబీ గూటిలో అప్పుడే కుర్చీలాట మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు కనుచూపుమేరలో లేకున్నా ఫైటింగ్ మాత్రం అప్పుడే షురూ అయ్యింది. తాజా మాజీల మధ్య వివాదం గులాబీ పార్టీలో గుబాలిస్తూనే ఉంది. పలుమార్లు TRS పెద్దలు నచ్చజెప్పినా భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమ ప్రాబల్యాన్ని కాపాడుకొనే పనిలో పడ్డారు. ప్రస్తుత MLAలపై అవకాశం దొరికిన ప్రతిసారీ మాజీ MLAలు గళం విప్పుతూనే ఉన్నారు. కొందరు అడ్జెస్ట్ అయితే కొందరు మాత్రం తెలంగాణ భవన్ మెట్లెక్కుతున్నారు.

అధికార పార్టీలో మాజీ వర్సెస్ తాజా హాట్ టాపిక్ అయింది.. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా ఇప్పటి నుండే రుసరుసలు మొదలయ్యాయి…2018 లో TRS పార్టీ నుండి పోటీ చేసి ఒడిపోయిన MLAల స్థానాల్లో ఇతర పార్టీలు అయిన కాంగ్రెస్, TDP ల నుండి చాలా మంది MLAలు TRS పార్టీలో చేరారు. అయితే అలా చేరిన నియోజకవర్గాల్లో కోద్ధి రోజుల పాటు మాజీ MLA తాజా MLA ల మధ్య పొసగలేదు కానీ హైకమాండ్ జోక్యం తో చాలా వరకు వ్యవహారం సెట్ అయింది. చాలా చోట్ల కొందరు కలిసిమెలిసి ఉంటే కొందరు టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. కానీ ఈ మధ్య కొన్ని నియోజవర్గాల్లో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ MLA తాటి వెంకటేశ్వర్లు రీసెంట్ గా TDP నుండి TRSలో చేరిన MLA మెచ్చ నాగేశ్వరరావు ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. TRS కార్యకర్తల సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TRS నాయకుల మధ్య అభిప్రాయం బేధాలు ఉన్నాయని అధిష్టానం తరుపున మంత్రి KTR లాంటి వాళ్ళు వచ్చి ఈ సమస్య తీర్చాలని లేదంటే 2018 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మరల పునరావృతం అవుతాయంటూ హెచ్చరికలు చేయడం హాట్ టాపిక్ అయింది.

అటూ అదే ఉమ్మడి ఖమ్మంలో పాలేరు నియోజకవర్గంలో కూడా కోల్డ్ వార్ నడుస్తోంది. పాలేరు లో ఈ మధ్య రెగ్యులర్‌గా పర్యటనలు చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ అభివృద్ధి నినే చెసా అంటూ అక్కడి MLA ఉపేందర్ రెడ్డికి చురకలు అంటిస్తూనే ఉన్నారు. ఇక ఇటూ తాండూర్ లో మాజీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ,ఎమ్మెల్యే పైలెట్ ల మధ్య పంచాయతీ తెలిసిందే.

ఇక్కడ ఏకంగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ నాదే అంటూ మహేందర్ రెడ్డి మాట్లాడటం హాట్ టాపిక్ అయింది. వీరిద్దరికి తాండూర్ లో అసలు పోసగడం లేదు…ఇలానే నకిరేకల్ లో మాజీ ఎమ్మెల్యే వీరేశం బయటకు చెప్పకపోయినా ఆయనకు అక్కడి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది…అటు కొల్లాపూర్ లోను మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ను కాదని మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు రెబల్స్ ని రంగం దింపడం దాని తరువాత జరిగిన పరిణామాలు చూసాము..

ఇప్పటికి MLA హర్షవర్ధన్ రెడ్డికి జూపల్లి కృష్ణారావుకి పోసగడం లేదని సమాచారం… కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లో ఎమ్మెల్యే జాజుల సురేందర్ రెడ్డి కి మాజీ MLA ఏనుగు రవీందర్ రెడ్డికి పడక చివరకు ఏనుగు TRS ను వదిలేశారు. మొత్తానికి ఇతర పార్టీ ల నుండి వచ్చిన MLAలకు TRS నుండి ఓడిపోయిన మాజీలు మధ్య సయోధ్య అనేది వర్క్ అవుట్ అవ్వడం సాధ్యం కాదని తెలుస్తోంది.. రానున్న రోజుల్లో వీరిని టిఆర్ ఎస్ అధిష్టానం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.

శ్రీధర్ ప్రసాద్, TV9 ప్రతినిధి, హైదరాబాద్.

ఇవి కూడా చదవండి: డుగ్గు డుగ్గు డ్యాన్స్‌తో అదరగొట్టిన టీఆర్‌ఆస్‌ ఎమ్మెల్యే.. ‘బుల్లెట్‌ బండి’ రాజయ్య స్టెప్పులు

YCP Leader Warning: పనులు ఆపేస్తారా.. దాడులు చేయమంటారా..కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ నాయకుడి వార్నింగ్‌

Mysterious Fever: చిన్నారులను వెంటాడుతున్న మరో అంతుచిక్కని జ్వరం.. 48 గంటల్లో 50 మంది మృతి..