టీడీపీయా..? వైసీపీయా..? విన్నర్ ఎవరు..?

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి రసవత్తరంగా జరిగిన ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజుల్లో తేలనున్నాయి. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లేమో జోరుగా బెట్టింగ్‌లు కడుతున్నారు. అయితే ఈ లోపు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయ విశ్లేషకులతో పాటు ఇటు ఏపీ ప్రజలను అయోమయంలో పడేశాయి. స్థానిక, జాతీయ మీడియాలు జరిపిన సర్వేలన్నీ ఒక్కొక్కటి ఒక్కో విధంగా తమ ఫలితాలను వెల్లడించాయి. కొన్ని సర్వేలలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేయగా.. మరికొన్ని వైసీపీదే అధికారం అంటూ తేల్చేశాయి. […]

టీడీపీయా..? వైసీపీయా..? విన్నర్ ఎవరు..?
Follow us

| Edited By: Srinu

Updated on: May 21, 2019 | 7:48 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి రసవత్తరంగా జరిగిన ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజుల్లో తేలనున్నాయి. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లేమో జోరుగా బెట్టింగ్‌లు కడుతున్నారు. అయితే ఈ లోపు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయ విశ్లేషకులతో పాటు ఇటు ఏపీ ప్రజలను అయోమయంలో పడేశాయి. స్థానిక, జాతీయ మీడియాలు జరిపిన సర్వేలన్నీ ఒక్కొక్కటి ఒక్కో విధంగా తమ ఫలితాలను వెల్లడించాయి. కొన్ని సర్వేలలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేయగా.. మరికొన్ని వైసీపీదే అధికారం అంటూ తేల్చేశాయి. మొత్తానికి మిశ్రమ సర్వేలతో అసలు అధికారం ఎవరిదో అంటూ ఏపీ ప్రజలలో అయోమయం నెలకొంది. ఇప్పటివరకు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ టీడీపీదే అధికార పీఠమని స్పష్టం చేయగా.. సహజంగానే ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ కుర్చీనెక్కడం ఖాయమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన గానీ.. లేదా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ల పార్టీల విషయం కానీ ఎవరూ పెద్దగా ఊసెత్తడం లేదు. సింగిల్ డిజిట్‌తో జనసేన పార్టీ మూడో స్థానంలోకి రావొచ్చని మాత్రం ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల హవా చాపకింద నీరులా ఉన్నప్పటికీ.. ఏపీ వంటి రాష్ట్రాల్లో ఈ పార్టీల హవా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల భవితవ్యం ఏమిటో ఓటర్లే తేల్చాల్సి ఉంది.