ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్..ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ వ్యూహం మారేనా ?

ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి..ఇక  ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎన్నడూ లేని టెన్షన్  మొదలైంది. ఇప్పటివరకూ ఈ ఎన్నికల్లో ఎవరికి  వారు గెలుపు తమదేనని జబ్బలు చరచుకుంటూ వచ్చారు. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ..కేంద్రంలో ఎన్డీయే దే పై చేయి కావచ్చునని తేల్చి చెప్పాయి. దీంతో ముఖ్యంగా తటస్థ పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. తమ వ్యూహాలను మార్చుకునే పనిలో పడ్డాయి. తెలంగాణాలో సిఎం కేసీఆర్ విషయానికే వస్తే.. ఈ ఫలితాలతో ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంశంలో తొందరపడరాదనే […]

  • Anil kumar poka
  • Publish Date - 12:38 pm, Tue, 21 May 19
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్..ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ వ్యూహం మారేనా ?
ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి..ఇక  ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎన్నడూ లేని టెన్షన్  మొదలైంది. ఇప్పటివరకూ ఈ ఎన్నికల్లో ఎవరికి  వారు గెలుపు తమదేనని జబ్బలు చరచుకుంటూ వచ్చారు. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ..కేంద్రంలో ఎన్డీయే దే పై చేయి కావచ్చునని తేల్చి చెప్పాయి. దీంతో ముఖ్యంగా తటస్థ పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. తమ వ్యూహాలను మార్చుకునే పనిలో పడ్డాయి. తెలంగాణాలో సిఎం కేసీఆర్ విషయానికే వస్తే.. ఈ ఫలితాలతో ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంశంలో తొందరపడరాదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో తటస్థ పార్టీలు  వందకు పైగా ఎంపీ స్థానాలు దక్కించుకుంటే  బీజేపీని కూడా శాసించవచ్చునని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఏమైనా వేచి చూచే ధోరణిలో ఉన్నారాయన. ఫెడరల్ ఫ్రంట్ తో తటస్థులను ఒక్క తాటిపైకి తేవాలన్నది ఆయన వ్యూహం. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ శిబిరాల్లో చేరకుండా,,టీఆర్ఎస్ ఎలాంటి ముఖ్య పాత్ర వహించాలన్న దానిపై కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టారని వార్తలు వస్తున్నాయి. తమతో కలిసి వచ్చే పార్టీలపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల డీఎంకె అధినేత స్టాలిన్ తోను, అంతకుముందు బిజూ జనతాదళ్ అధినేత,  ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తోను భేటీ అయిన విషయం తెలిసిందే. కాగా-ఫలితాల అనంతరమే వైసీపీ అధినేత జగన్, బీఎస్పీ అధినేత్రి మాయావతి వంటివారు స్పందించే ధోరణిలో ఉన్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడైతే..నాన్-బీజేపీ పార్టీలతో కలిసి…మహాకూటమి ఏర్పాటుపై ముమ్మరంగా టూర్లు పెట్టుకుంటున్నారు. ఢిల్లీ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల పర్యటనల్లో తమతో కలిసి వచ్చే పార్టీల మద్దతును కూడగట్టడానికి ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు.. ఈ నేపథ్యంలో అంది కళ్ళూ ఈ నెల 23 న వెలువడే ఫలితాలపై ఉన్నాయి.