AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu tips: తరచూ గొడవలా? మీ ఇంట్లో ఈ వస్తువులుంటే.. వెంటనే తీసేయండి

వాస్తుశాస్త్రం అనేక వాస్తు సమస్యలకు పరిష్కారం చూపుతుంది. హిందూమతంలో ఈ శాస్త్రానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. చాలా మంది తమ నివాసాలను వాస్తు శాస్త్రం ప్రకారమే నిర్మించుకుంటారు. కొందరు తమకు ఏం చేసినా కలిసిరావట్లేదని భావిస్తే వాస్తుశాస్త్ర నిపుణులను కలిసి.. వారి నివాసాల్లో తగిన మార్పులను చేసుకుంటారు. వాస్తు మార్పులతో తమకు మంచి జరుగుతుందని భావిస్తారు.

Vastu tips: తరచూ గొడవలా? మీ ఇంట్లో ఈ వస్తువులుంటే.. వెంటనే తీసేయండి
Vastu Tips
Rajashekher G
|

Updated on: Jan 01, 2026 | 12:18 PM

Share

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి గొప్ప ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం అనేది నివాసాల నిర్మాణం, ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఏ వస్తువులు ఇంట్లో ఉండకూడదు, ఏ వస్తువులు ఉంటే మంచిది అనే చాలా విషయాలను తెలియజేస్తుంది. అందుకే చాలా మంది తమ నివాసాలను వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించుకుంటారు. మానవ జీవితంలో జరుగుతున్న పలు సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుంది.

ఉదాహరణకు మీరు అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవడం. మీ ఇంట్లోకి ఎంత డబ్బు వచ్చినా నిలవకపోవడం. సజావుగా సాగుతున్న దాంపత్య జీవితంలో గొడవలు. ఇలాంటి సమస్యలకు వాస్తు శాస్త్రం పలు సూచనలు చేసి వాటిని నివారిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని చెట్లు, వస్తువులు, విగ్రహాలను ఇంట్లో ఉంచకోకూడదు. అలా చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తి నిరంతరం సమస్యలను సృష్టిస్తూనే ఉంటుంది. మీతోపాటు మీ కుటుంబంపైనా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఆ చెట్లు మీ ఇంట్లో ఉండనీయొద్దు

వ్యాపారంలో గానీ, కుటుంబంలో గానీ ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టి వేధిస్తుంటాయి. వ్యాపారం ఆర్థికంగా దెబ్బతింటుంది. కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. ఎలాంటి కారణం లేకుండానే నివాసంలో కలహాలు చోటు చేసుకుంటాయి. ఇలా ప్రతికూల శక్తికి కారణమవుతుంటాయి. అందుకే వీటిని నివారించేందుకు వాస్తుశాస్త్రం అలాంటి వస్తువులను ఇంటి నుంచి తొలగించాలని సూచిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ముళ్ల పొదలు లాంటి చెట్లు ఉండకూడదు.

నటరాజు విగ్రహం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

ఇక, వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంట్లో నటరాజు విగ్రహం ఎప్పుడూ ఉంచుకోకూడదు. నటరాజు మహా శివుడి రూపం. అయితే, శివుడు ఈ రూపంలో తాండవం చేస్తున్నట్లు ఉంటాడు. కాబట్టి ఈ విగ్రహం ఇంట్లో ఉంటే వివిధ సమస్యలు రావచ్చు. ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అందుకే మీ ఇంట్లో నటరాజు విగ్రహం ఉంచుకోకూడదని స్పష్టం చేస్తుంది.

వాస్తు ప్రకారం ఇంట్లో శివలింగం ఉంచుకోవాలి. ప్రతిరోజూ విగ్రహాన్ని పూజించాలి. మంచి మనస్సుతో మహా దేవుడిని ప్రార్థించాలి. దీంతో ఆ మహా శివుడి అనుగ్రహం ఎప్పుడూ మీపై ఉంటుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి అన్ని సమస్యలు తొలగిపోతాయి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.