Hyderabad: ఇంటికి పోతే పొట్టు పొట్టు కొడతారు సార్.. పోలీసుల కాళ్లు పట్టుకున్న మందుబాబు.. ఇదిగో వీడియో
న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు వెరైటీ విన్యాసాలన్నీ చేశారు.. ఫుల్లుగా మద్యం తాగి పోలీసులకు దొరికిపోయి నానా హంగామా చేశారు.. పాతబస్తీ ఫలక్‌నుమాలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిన ఓ యువకుడు రోడ్డుకు అడ్డంగా పడుకుని బోరున ఏడ్చాడు..

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు వెరైటీ విన్యాసాలన్నీ చేశారు.. ఫుల్లుగా మద్యం తాగి పోలీసులకు దొరికిపోయి నానా హంగామా చేశారు.. పాతబస్తీ ఫలక్‌నుమాలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిన ఓ యువకుడు రోడ్డుకు అడ్డంగా పడుకుని బోరున ఏడ్చాడు.. ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్లు తిడతారని తన బండి ఇప్పించాలని పోలీసులను వేడుకున్నాడు. పోయిన సారి దొరికితే పొట్టుపొట్టుగా కొట్టారని.. ఇప్పుడు బండి లేకుండా పోతే.. తన పరిస్థితి ఏంటంటూ.. పోలీసుల ముందు సాగిలపడ్డాడు.. కాళ్లు పట్టుకుని బండి ఇప్పించాలంటూ వేడుకున్నాడు..
వీడియో చూడండి..
ఇదిలాఉంటే.. కుల్సుంపురాలో డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన మరో వ్యక్తి కొత్త సంవత్సరం కాబట్టి కొద్దిగా తాగితే మిషన్ ఎక్కువగా చూపిస్తుందంటూ..పోలీసులతో గొడవ పెట్టుకున్నాడు.. నాంపల్లిలో తనిఖీల్లో మందు తాగి అడ్డంగా దొరికిన యువకుడు పోలీసులకు చుక్కలు చూపించాడు, తన బైక్ ఇప్పించాలని కోరుతూ గోడకు తల బాదుకున్నాడు పోలీసుల కాళ్లు పట్టుకొని నానా హంగామా సృష్టించాడు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
