Huzurabad By-Election: ఎవరొస్తారో రండి… టీఆర్ఎస్‌కు ఈటల రాజేందర్ సవాల్..
Etela Rajender: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనపై పోటీకి కేసీఆర్, హరీశ్ రావులలో ఎవరు వస్తారో రావాలంటూ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనపై పోటీకి కేసీఆర్, హరీశ్ రావులలో ఎవరు వస్తారో రావాలంటూ సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదామని ఈటల అన్నారు. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని.. మీరు ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా..? అంటూ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. TRS ఆరిపోయే దీపమని.. ఆరిపోయే ముందే ఎక్కువ వెలుతురు ఇస్తుందంటూ ఈటల వ్యాఖ్యానించారు. తాను ఉన్నంతకాలం ప్రజల కోసం కొట్లాడతానని.. పదవుల కోసం కాదని తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి: Terrorists Planning: భారీ దాడులకు టెర్రరిస్టుల ప్లాన్.. ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్