Yediyurappa Tour: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు యడ్యూరప్ప రెడీ.. కుమారుడితో కలిసి రాష్ట్రవ్యాప్త పర్యటనకు ప్లాన్..
కర్ణాటక రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ సీఎం యడ్యూరప్ప..బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటనకు రెడీ అవుతున్నారు. ఐతే యడ్యూరప్ప పర్యటనకు హైకమాండ్ ఓకే అంటుందా..?
కర్ణాటక రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ సీఎం యడ్యూరప్ప..బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటనకు రెడీ అవుతున్నారు. అయితే.. యడ్యూరప్ప పర్యటనకు హైకమాండ్ ఓకే అంటుందా..? ఏం జరగబోతోంది..? కర్ణాటక రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. మాజీ సీఎం యడియూరప్ప బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. సీఎం పదవి నుంచి తనను బలవంతంగా రాజీనామా చేయించారని హైకమాండ్‌పై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు మంత్రివర్గంలో తన కుమారుడికి, అనుచరులకు ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన బలం చూపించేందుకు యడియూరప్ప సిద్ధమయ్యారని కర్ణాటక రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రి మార్పు తర్వాత యడ్యూరప్ప..మౌనంగానే ఉంటున్నారు. ఇటీవల కుటుంబంతో కలిసిమాల్దీవుల పర్యటనకు వెళ్లి వచ్చారు. రావడంతోనే మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా మారుతాననే సంకేతాలు పంపారు. తన కుమారుడితో కలిసి రాష్ట్రమంతా పర్యటిస్తానని ప్రకటించారు. ఇందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఈ పర్యటనలో కుమారుడు విజయేంద్ర కీలకంగా వ్యవహరించనున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే బీజేపీలో ఉంటూనే తన బలం చూపించుకునే విధంగా యడియూరప్ప వ్యుహాలు రచిస్తున్నారు. ఇప్పుడీ పరిణామాలు రాష్ట్ర బీజేపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎలాగైనా యడియూరప్ప రాష్ట్ర పర్యటన వాయిదా వేయించేలా చూడాలని కోరుతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. యడియూరప్ప ఇలాంటి పర్యటనలు చేపట్టడం కొత్త సమస్యలు తలెత్తుతాయని భయపడుతున్నారు.
అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే తన పర్యటన ఉద్దేశమంటున్నారు యడ్యూరప్ప. కానీ దీని వెనుక చాలా లెక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. తనే బీజేపీకి పెద్ద దిక్కు అనిపించేలా యడ్డి వర్గం కార్యాచరణ ఉండనుందని సమాచారం. ఐతే ఇతర నాయకులను కూడా పర్యటనలో కలుపుకుని వెళ్లాలని..తండ్రీ-కొడుకుల వ్యవహారంలా ఉండకూదని బీజేపీ హైకమాండ్ యడియూరప్పకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యడియూరప్ప ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి: Terrorists Planning: భారీ దాడులకు టెర్రరిస్టుల ప్లాన్.. ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్