ఎవరికి ఓటు వేసినా.. ఆ ఓటు బీజేపీకే: అఖిలేష్..

ఈవీఎంల పనితీరుపై ‌తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ఎవరికి ఓటు వేసినా.. ఆ ఓటు బీజేపీకే వెళ్తోందని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని విమర్శించారు. కాగా.. పోలింగ్ సిబ్బందికి కూడా ఈవీఎంలు ఎలా ఆపరేట్ చేయాలో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 350కి పైగా ఈవీఎంలను మార్చారని పేర్కొన్నారు. ఇది నేరపూరిత నిర్లక్ష్యమని అఖిలేష్ మండిపడ్డారు. ఈ ఎన్నికల […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:38 pm, Tue, 23 April 19
ఎవరికి ఓటు వేసినా.. ఆ ఓటు బీజేపీకే: అఖిలేష్..

ఈవీఎంల పనితీరుపై ‌తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ఎవరికి ఓటు వేసినా.. ఆ ఓటు బీజేపీకే వెళ్తోందని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని విమర్శించారు. కాగా.. పోలింగ్ సిబ్బందికి కూడా ఈవీఎంలు ఎలా ఆపరేట్ చేయాలో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 350కి పైగా ఈవీఎంలను మార్చారని పేర్కొన్నారు. ఇది నేరపూరిత నిర్లక్ష్యమని అఖిలేష్ మండిపడ్డారు. ఈ ఎన్నికల కోసం ప్రధాని మోదీ రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.