సీన్ రివర్సయ్యిందే.. దిగ్విజయ్ తెల్లముఖం

భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ సీఎం, భోపాల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ కు ఛేదు అనుభవం ఎదురైంది. దిగ్విజయ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భోపాల్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభకు యువతీయువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సభలో దిగ్విజయ్ మాట్లాడుతూ..మోదీ వేస్తానన్న రూ.15 లక్షలు మీ ఖాతాలో జమ అయ్యాయా..? అని ప్రశ్నించారు. ఇంతలోనే ఓ యువకుడు సమాధానం చెప్పేందుకు స్టేజీపైకి రాగా..దిగ్విజయ్ అతనికి మైక్ ఇచ్చారు. మోదీ సర్జికల్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:53 pm, Tue, 23 April 19
సీన్ రివర్సయ్యిందే.. దిగ్విజయ్ తెల్లముఖం

భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ సీఎం, భోపాల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ కు ఛేదు అనుభవం ఎదురైంది. దిగ్విజయ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భోపాల్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభకు యువతీయువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సభలో దిగ్విజయ్ మాట్లాడుతూ..మోదీ వేస్తానన్న రూ.15 లక్షలు మీ ఖాతాలో జమ అయ్యాయా..? అని ప్రశ్నించారు. ఇంతలోనే ఓ యువకుడు సమాధానం చెప్పేందుకు స్టేజీపైకి రాగా..దిగ్విజయ్ అతనికి మైక్ ఇచ్చారు. మోదీ సర్జికల్ దాడులు చేపట్టారు..ఉగ్రవాదులను చంపేశారని..మోదీకి మద్దతుగా ఆ యువకుడు మాట్లాడాడు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలంతా షాక్ తిన్నారు. దిగ్విజయ్ సైతం నోటమాట రాక ఆశ్చర్యపోయారు. చివరకు సీన్ రివర్స్ చేసిన ఆ యువకుడిని కాంగ్రెస్ నేత ఒకరు.. స్టేజీ నుంచి కిందకు పంపించేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.