లోక్‌సభ ఎన్నికల బరిలో స్విగ్గీ డెలివరీ బాయ్‌

అతను ఎన్నికల బరిలో నిలిచాడు. హేమాహేమీలను ఢీ కొట్టాడు. అతని పేరు జెనిఫర్ జే రస్సెల్. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోని 22 మంది అభ్యర్థుల్లో ఈయన ఒకరు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. జెనిఫర్ జే రస్సెల్ కేరళకు చెందిన వ్యక్తి. స్వస్థలం తిరువనంతపురం. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కార్పొరేట్ సెక్టార్‌లో టెలికం ఇంజినీర్‌గా ఉద్యోగం చేసేవారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు తన ఉద్యోగాన్ని వదిలేశారు. కేరళలో ట్రాఫిక్ పోలీస్ వార్డెన్‌‌గా పనిచేశారు. తర్వాత […]

లోక్‌సభ ఎన్నికల బరిలో స్విగ్గీ డెలివరీ బాయ్‌
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2019 | 10:44 AM

అతను ఎన్నికల బరిలో నిలిచాడు. హేమాహేమీలను ఢీ కొట్టాడు. అతని పేరు జెనిఫర్ జే రస్సెల్. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోని 22 మంది అభ్యర్థుల్లో ఈయన ఒకరు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.

జెనిఫర్ జే రస్సెల్ కేరళకు చెందిన వ్యక్తి. స్వస్థలం తిరువనంతపురం. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కార్పొరేట్ సెక్టార్‌లో టెలికం ఇంజినీర్‌గా ఉద్యోగం చేసేవారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు తన ఉద్యోగాన్ని వదిలేశారు. కేరళలో ట్రాఫిక్ పోలీస్ వార్డెన్‌‌గా పనిచేశారు. తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా చేరారు. ఆ తరువాత ఉబెర్‌లో డ్రైవర్‌గా చేశారు. తర్వాత ఈ జాబ్ కూడా వదిలేసి స్విగ్గీలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు.

జెనిఫర్ జే రస్సెల్ ఒకసారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూలో.. స్విగ్గీలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం తనను సిటీతో ఎలా కనెక్ట్ అయ్యేలా చేసిందో వివరించారు. ‘గతంలో నేను ఏసీ కారులో ఉద్యోగానికి వెళ్లే వాడిని. ఇప్పుడు పట్టణంలోని కాలుష్యం ఏ స్థాయిలో ఉందో, రోడ్లు ఎలా ఉన్నాయో, ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇష్యూలు, చెత్త, గార్బేజ్ డంపింగ్ ఏరియాల వంటి ఎన్నో విషయాలను తెలుసుకున్నా. టూవీలర్ మీద ప్రయాణించినప్పుడే అసలు సిటీ అంటే ఏంటో తెలిసింది’ అని వివరించారు.