దేశ వ్యాప్తంగా ఎలక్షన్ వార్
సమ్మర్ హీట్‌తో దేశంలో రాజకీయ వేడి పోటీ పడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచే పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలో దేశ వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్న బీజేపీ అదే దూకుడు కొనసాగిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో జాతీయాధ్యక్షుడు అమిత్ షా భేటీ అవుతున్నారు. సాధారణ ఎన్నికల్లో […]
సమ్మర్ హీట్‌తో దేశంలో రాజకీయ వేడి పోటీ పడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచే పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలో దేశ వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి.
ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్న బీజేపీ అదే దూకుడు కొనసాగిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో జాతీయాధ్యక్షుడు అమిత్ షా భేటీ అవుతున్నారు. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై సుధీరంగా చర్చించనున్నారు అమిత్ షా. ప్రచార సభలపై కూడా ఆయా పార్టీ అధ్యక్షుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డిలు కాసేపట్లో అమిత్ షాతో భేటీ అవుతారు.
కాగా.. తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్. ఇప్పటికే 14 స్థానాల్లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టామన్నారు. కేంద్రంలో ఎవరి సహకారం లేకుండానే బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.
మరోవైపు కాంగ్రెస్ కూడా బీజేపీతో సమానంగా కసరత్తు చేస్తోంది. పార్టీల కీలక కమిటీ అయిన కోర్ కమిటీతో అధ్యక్షులు రాహుల్ గాంధీ భేటీ కాబోతున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీని రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చిస్తారు. రాష్ట్రాల వారీగా వచ్చిన ఎంపీ అభ్యర్థుల లిస్టులపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు.