AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓరి బడవల్లారా.! ట్రాక్టర్‌లో పత్తి లోడ్ తీసుకెళ్తున్నారనుకుంటే.. పోలీసులకే షాక్ ఇచ్చారుగా..

బెట్టింగ్ భూతం యువతను పట్టి పీడిస్తోంది. జడలు విప్పిన బెట్టింగ్ కోసం యువత అడ్డదారులు తొక్కుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు కొందరు యువకులు దొంగలుగా మారుతున్నారు. బెట్టింగ్ డబ్బుల కోసం ఈ యువకులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: ఓరి బడవల్లారా.! ట్రాక్టర్‌లో పత్తి లోడ్ తీసుకెళ్తున్నారనుకుంటే.. పోలీసులకే షాక్ ఇచ్చారుగా..
Tractor
M Revan Reddy
| Edited By: |

Updated on: Jan 13, 2026 | 10:02 AM

Share

నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన వీరబోయిన మహేష్‌ పత్తిని సాగు చేశాడు. తాను పండించిన పత్తిని అమ్మేందుకు ఈ నెల 8న ట్రాక్టర్‌లో లోడు చేసి అదే గ్రామానికి చెందిన ప్రదీప్‌రెడ్డి ఇంటి సమీపంలో పార్కింగ్‌ చేశాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి పత్తి లోడు ట్రాక్టర్‌ మాయమైంది. దీంతో మహేష్‌ కేతేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే కేతేపల్లి మండలం భీమారంకు చెందిన నూకల కోటేష్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌ అలవాటుపడ్డాడు.

ఇది చదవండి: ‘ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా తీశాడు..’

విలాసాల కోసం వ్యవసాయంతో వచ్చే ఆదాయం సరిపోక ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 2019లో మాడుగులపల్లి, వేములపల్లి, కేతేపల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ట్రాక్టర్‌లు చోరీ చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా కోటేష్‌‌లో మార్పు రాకపోగా మళ్లీ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు సూర్యాపేటకు చెందిన ఆడెపు సాయికుమార్‌తో కలిసి తిరిగి దొంగతనాలకు ప్లాన్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ నెల 8వ తేదీ రాత్రి కేతేపల్లిలో వీరబోయిన మహేష్‌ పత్తి లోడు ట్రాక్టర్‌ను చోరీ చేశారు. ట్రాక్టర్‌లోని కొంత పత్తిని సూర్యాపేట మండలం బాలెంలోని కాటన్‌ మిల్లులో విక్రయించారు. ఇందుకు 72 వేల రూపాయలు వచ్చాయి. మిగిలిన పత్తిని కట్టంగూర్‌ మండలం అయిటిపాములలోని కాటన్‌ మిల్లుకు తరలిస్తున్నారు. ఇదే సమయంలో కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా, ట్రాక్టర్‌ను ఆపకుండా కోటేష్ అనుమానస్పదంగా కనిపించాడు. దీంతో కేతపల్లి పోలీసులు పట్టుకుని విచారించగా ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించారని నల్లగొండ డి.ఎస్.పి శివరామిరెడ్డి తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రూ.50వేల నగదు, ట్రాక్టర్‌ స్వాధీనం చేసుకున్నారని అన్నారు.

ఇది చదవండి: సామాన్య వ్యక్తిని కూడా కోటీశ్వరుడిని చేయొచ్చు..! ఇది తెలిస్తే శాలరీ లేకపోయినా హ్యాపీగా బ్రతికేయొచ్చు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

దేవుడి పేరుతో హత్యలు.. OTT టాప్ ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్
దేవుడి పేరుతో హత్యలు.. OTT టాప్ ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్
భారత్‌ అమెరికా ట్రేడ్‌ డీల్‌.. వారికి లాభాల పంట!
భారత్‌ అమెరికా ట్రేడ్‌ డీల్‌.. వారికి లాభాల పంట!
ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!
పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!
గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఏప్రిల్ 1 నుంచి..
గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఏప్రిల్ 1 నుంచి..