AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో ఎంత పనైంది.. రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు ఒకే ప్రమాదంలో..

హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. దైవ దర్శనం ముగించుకుని శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. .. ..

అయ్యో ఎంత పనైంది.. రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు ఒకే ప్రమాదంలో..
Brothers
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Apr 02, 2026 | 9:01 PM

Share

హనుమకొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సొంత అన్నాదమ్ములు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం అలముకుంది. ఇదే ప్రమాదంలో వారి మరో ఐదుగురు కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. దైవ దర్శనం అనంతరం ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం ముప్పారం గ్రామశివారులో యాక్సిడెంట్ జరిగింది. దేవునూర్ శివారు నుంచి కుటుంబ సభ్యలతో వస్తున్న కారు ముప్పారం శివారు సమీపంలోఅదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.  రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ప్రమాదంలో లోకేష్ & అశోక్ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో చుట్టుపక్కల రైతులు ఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్‌కి సమాచారం అందించగా ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించారు..

మృతులు, భాదితులు తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్‌లో కుటుంబ సభ్యలంతా వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చారు.. అనంతరం చిలుకూరు బాలాజీ దైవదర్శనం చేసుకుని అక్కడి నుంచి ముప్పారం గ్రామంలో శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ మరణాలతో ఊరంతా విషాద వాతావరణం అలుముకొని ఉంది.

Also Read: కిచెన్‌లో ఉండే ఈ పదార్థంతో ఇలా చేయండి.. మల్లెపూలు పిచ్చిపిచ్చిగా పూస్తాయి.. 

Follow Us