AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్కీ డ్రాలో ఎంపీపీగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యురాలు

రాజకీయాల్లో అందలం దక్కాలంటే ప్రజాభిమానంతోపాటు అదృష్టం కూడా కలిసిరావాలి. ఇందుకు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎంపీపీగా ఎన్నికైన హాలావత్‌ జ్యోతి ఉదాహరణ. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజా తీర్పు అనుకూలంగానే ఉన్నా అవసరమైన పూర్తి బలం రాకపోవడంతో చివరికి అదృష్టాన్నే నమ్ముకోక తప్పలేదు . అనుకున్నట్టే లాటరీలో అదృష్టం ఆమెనే వరించింది. నర్సాపురం మండలంలో మొత్తం పది ఎంపీపీటీసీ స్థానాలున్నాయి. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ చెరో ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. బలం సమానంగా ఉన్నందున […]

లక్కీ డ్రాలో ఎంపీపీగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యురాలు
Anil kumar poka
|

Updated on: Jun 08, 2019 | 10:15 AM

Share

రాజకీయాల్లో అందలం దక్కాలంటే ప్రజాభిమానంతోపాటు అదృష్టం కూడా కలిసిరావాలి. ఇందుకు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎంపీపీగా ఎన్నికైన హాలావత్‌ జ్యోతి ఉదాహరణ. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజా తీర్పు అనుకూలంగానే ఉన్నా అవసరమైన పూర్తి బలం రాకపోవడంతో చివరికి అదృష్టాన్నే నమ్ముకోక తప్పలేదు . అనుకున్నట్టే లాటరీలో అదృష్టం ఆమెనే వరించింది. నర్సాపురం మండలంలో మొత్తం పది ఎంపీపీటీసీ స్థానాలున్నాయి. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ చెరో ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. బలం సమానంగా ఉన్నందున ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ సభ్యులను లాటరీ పద్ధతిలో ఎన్నుకోవాలని అధికారులు నిర్ణయించారు. నర్సాపూర్‌లోని మండల పరిషత్‌ కార్యాలయంలో లాటరీ తీశారు. అదృష్టం కాంగ్రెస్‌ ఎంపిటీసీ సభ్యురాలు హలావత్‌ జ్యోతి తలుపుతట్టింది. దీంతో పదవిపై బోలెడు ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ నాయకురాలు, చిప్పల్‌తుర్తి ఎంపీటీసీ సభ్యురాలు సంధ్యారాణినాయక్‌కు నిరాశే ఎదురైంది. అయితే ఉపాధ్యక్షుడు, కో ఆప్షన్‌ సభ్యుడి పదవులు మాత్రం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి దక్కడంతో ఆ పార్టీ నాయకులు కొంత సంతృప్తి చెందారు.

Follow Us
శనిదేవుడి కటాక్షం..30 ఏళ్ల తర్వాత వారి జాతకం మారనుంది..!
శనిదేవుడి కటాక్షం..30 ఏళ్ల తర్వాత వారి జాతకం మారనుంది..!
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్