ఒడిశా స్వతంత్ర అభ్యర్థి పట్టుదల!
రాజకీయాల్లో, క్రీడల్లో గెలుపు ఓటములు సహజం. కానీ ఒడిశాకు చెందిన శ్యాంబాబు సుబుధి మాత్రం వివిధ స్థాయిలో జరిగిన ఎన్నికల్లో ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 30సార్లు ఓడిపోయారు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఈ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెబుతున్నాడు. ‘ నేను తొలిసారిగా 1962లో పోటీ చేశాను. ఇప్పటి వరకు వివిధ ఎన్నికల్లో పోటీ చేశాను. లోక్ సభ, అసెంబ్లీ అనే తేడా […]

రాజకీయాల్లో, క్రీడల్లో గెలుపు ఓటములు సహజం. కానీ ఒడిశాకు చెందిన శ్యాంబాబు సుబుధి మాత్రం వివిధ స్థాయిలో జరిగిన ఎన్నికల్లో ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 30సార్లు ఓడిపోయారు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఈ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెబుతున్నాడు.
‘ నేను తొలిసారిగా 1962లో పోటీ చేశాను. ఇప్పటి వరకు వివిధ ఎన్నికల్లో పోటీ చేశాను. లోక్ సభ, అసెంబ్లీ అనే తేడా లేకుండా అన్నింట్లోనూ బరిలోకి దిగాను. ఈ క్రమంలో వివిధ పార్టీల నుంచి నాకు పిలుపులు కూడా అందాయి. అన్నింటిని తిరస్కరించి స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఆస్కా, బెర్హాంపూర్ లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు వేశాను. నేను పీవీ నరసింహారావు, బిజూ పట్నాయక్‌ల మీద కూడా పోటీ చేశాను. కానీ ఇప్పటి ఎన్నికలను చూస్తుంటే బాధగా ఉంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పెద్దమొత్తంలో డబ్బులు వెచ్చిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.



