నందిగామ ప్రచారసభలో చంద్రబాబు వ్యాఖ్యలు!

‘‘మీ పిల్లల్ని బడికి పంపించండి. వారిని ఇంజినీర్లు, డాక్టర్లను చేసే బాధ్యత నాది. వారి చదువుకు ఏడాదికి రూ.18వేలు ఇస్తున్నా. నాకు దేవాన్ష్‌ ఒక్కడే కాదు. రాష్ట్రంలో ఉన్న చిన్నారులంతా మనవలు, మనవరాళ్లే’’ అని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. వృద్ధులు, పేదలకు పెద్ద కొడుకుగా ఉంటానని, త్వరలోనే పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికల […]

నందిగామ ప్రచారసభలో చంద్రబాబు వ్యాఖ్యలు!
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2019 | 6:14 PM

‘‘మీ పిల్లల్ని బడికి పంపించండి. వారిని ఇంజినీర్లు, డాక్టర్లను చేసే బాధ్యత నాది. వారి చదువుకు ఏడాదికి రూ.18వేలు ఇస్తున్నా. నాకు దేవాన్ష్‌ ఒక్కడే కాదు. రాష్ట్రంలో ఉన్న చిన్నారులంతా మనవలు, మనవరాళ్లే’’ అని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.

వృద్ధులు, పేదలకు పెద్ద కొడుకుగా ఉంటానని, త్వరలోనే పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన కృష్ణా జిల్లా నందిగామలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ‘నారా కోసం… నారీ లోకం’ ముందుకొచ్చిందన్నారు. కృష్ణా జలాలు రాక డెల్టా రైతులు ఇబ్బంది పడ్డారని, పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు ఇచ్చామన్నారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి… మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కష్టపడ్డారని చంద్రబాబు కొనియాడారు.

చింతలపూడి లిఫ్ట్‌ ద్వారా గోదావరి నీళ్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నీటి సమస్యే ఉండదన్నారు. రాజధాని వల్ల కృష్ణా జిల్లాలో భూమి విలువ పెరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అందరివాడిగా ఉంటానని, కొందరివాడిగా ఉండనన్నారు. పేదరికమే కొలమానంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. భవిష్యత్‌లో ప్రతి ఏడాది మహిళలకు పసుపు-కుంకుమ ఇస్తానని చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..