శ్రీకాళహస్తిలో వైఎస్‌ విజయలక్ష్మి ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్‌ విజయలక్ష్మి ఆదివారం శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్‌పై కేసులు పెట్టించింది చంద్రబాబేనని ఆరోపించారు. రాజధాని భూములు చంద్రబాబు దోచుకున్నారని విమర్శించారు. వైఎస్‌ హయాంలో రైతు రాజ్యం పాలన సాగిందని, ప్రజల గుండెల్లో వైఎస్‌ నిలిచిపోయారని ఆమె స్పష్టం చేశారు. జగన్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూశారని, జగన్‌ అందరికీ అండగా ఉంటారని విజయలక్ష్మి పేర్కొన్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 3:46 pm, Sun, 7 April 19