కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. ఓట్ల లెక్కింపు ఇలా..

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ఈ నెల 14 ముగిసిన విషయం తెలిసిందే. అటు తెలంగాణలోనూ రెండు ఉపాధ్యాయ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల..

కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. ఓట్ల లెక్కింపు ఇలా..
Mlc Counting
Follow us
K Sammaiah

|

Updated on: Mar 17, 2021 | 7:06 AM

MLC Election Result: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ఈ నెల 14 ముగిసిన విషయం తెలిసిందే. అటు తెలంగాణలోనూ రెండు ఉపాధ్యాయ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. బ్యాలెట్‌ రూపంలో భద్రంగా ఉన్న అభ్యర్థుల అదృష్ట రేఖలు ఏ విధంగా ఉన్నాయో తేలిపోనుంది.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఇలా.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఓపెన్ చేస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించిన తర్వాత బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తారు. పోలయిన ఓట్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. మొత్తం ఓట్లను కట్టలు కట్టడానికి 8 నుంచి 10 గంటలు పట్టే అవకాశం ఉంది. ఒక్కో కౌంటింగ్ టేబుల్ పై 40 కట్టలు అంటే వెయ్యి ఓట్లు పెడతారు. 8 హాళ్లలో కౌంటింగ్, ఒక్కో హల్ లో 7 టేబుల్స్ , మొత్తం 56 టేబుళ్ళు ఉపయోగిస్తారు.

ఇక కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యాక ముందుగా చెల్లని ఓట్లు పక్కన పెడతారు. ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి 24 గంటల నుంచి 36 గంటలు పట్టే అవకాశం ఉంది. దీనికోసం మూడు షిఫ్ట్ ల్లో కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు భారీగా పోటీ పడటంతో కౌంటింగ్‌ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

ఈ నెల 14న హైదరాబాద్‌-రంగారెడ్డి్-మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 4 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున సురభి వాణీదేవి, బీజేపీ నుంచి రామచందర్‌రావు, కాంగ్రెస్‌ తరఫున చిన్నారెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మధ్య గట్టి పోటీ నడిచింది.

ఇక నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో టీఆర్‌ఎస్‌ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున రాములు నాయక్‌, యువతెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి తదితరులు పోటీ పడ్డారు.

అటు ఏపీలోగుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ జరగనున్న గుంటూరు ఏసీ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. 93.06 శాతం ఓట్లు పోలైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఓట్లు 13,505 కాగా… 12,556 ఓట్లు పోలయ్యాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ స్థానం కోసం 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

Read More:

మున్సిపల్‌ ఫలితాలతో వైసీపీ నేతల్లో ఫుల్‌ జోష్‌… ఆ మేయర్‌ పీఠం వైసీపీదేనన్న ఎంపీ భరత్‌

బెడిసికొట్టిన అచ్చెన్నాయుడి వ్యూహం.. ఆ రెండు చోట్లా టీడీపీకి పరాభవం.. కీలక నేతల శ్రమ వృథా

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.