బెడిసికొట్టిన అచ్చెన్నాయుడి వ్యూహం.. ఆ రెండు చోట్లా టీడీపీకి పరాభవం.. కీలక నేతల శ్రమ వృథా

పంచాయతీ ఎన్నికల పరాభవానికి మున్సిపల్‌ ఫలితాలతో సమాధానం ఇవ్వాలనే టీడీపీ పంతం నెరవేరలేదు. ముఖ్యంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఎత్తుగడలను..

బెడిసికొట్టిన అచ్చెన్నాయుడి వ్యూహం.. ఆ రెండు చోట్లా టీడీపీకి పరాభవం.. కీలక నేతల శ్రమ వృథా
Follow us
K Sammaiah

|

Updated on: Mar 16, 2021 | 12:13 PM

పంచాయతీ ఎన్నికల పరాభవానికి మున్సిపల్‌ ఫలితాలతో సమాధానం ఇవ్వాలనే టీడీపీ పంతం నెరవేరలేదు. ముఖ్యంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఎత్తుగడలను అధికార పార్టీ వైసీపీ చిత్తు చేసింది. పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలపై కీలక నేతల శ్రమంతా వృథా అయింది. ఆ మున్సిపాల్టీలను చేజిక్కించుకునేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లాలోని మిగతా మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ ప్రతినిధులు దృష్టి సారించారు. అయినా వారెవరూ ఫంక గాలికి అడ్డుకట్ట వేయలేకపోయారు.

పలాస, ఇచ్చాపురం మున్సిపాల్టీల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ కీలక నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు వాటిన్నింటినీ తిప్పికొట్టారు. జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం, పాలకొండలో ఎన్నికలను టీడీపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వీటిపైనే ఎక్కువ దృష్టిసారించారు. పోలింగ్‌ వరకు తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శించారు. అచ్చెన్నతో పాటు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర్‌ శివాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతు శిరీష, మిగతా మాజీ ఎమ్మెల్యేలంతా టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించి ఓడిపోయారు.

అయితే ఆ మున్సిపాల్టీలో ఓటమి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి ఘోర పరాభవమే. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌కు కూడా చావు దెబ్బ వంటిదేననే టాక్‌ వినిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లోనూ కళా వెంకటరావు వంటి వారు ఎంత ప్రయత్నించినా గెలవలేకపోయారు. ప్ర

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందు టీడీపీ నేతల ప్రచారం బెడిసి కొట్టిందనే టాక్‌ నడుస్తుంది. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు, పాలకొండలో విశ్వాసరాయి కళావతి, పాలవలస విక్రాంత్, ఇచ్ఛాపురంలో పిరియా సాయిరాజ్, నర్తు రామారావు తదితర నేతలే బాధ్యత తీసుకుని గెలిపించారు. మొత్తానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు అచ్చెన్నాయుడికి భంగపాటు తప్పలేదు.

Read More:

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో శ్రీనివాస్‌గౌడ్‌.. తన పుట్టిన రోజున మొక్కలు నాటిన ఆబ్కారీ మంత్రి

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.