AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో శ్రీనివాస్‌గౌడ్‌.. తన పుట్టిన రోజున మొక్కలు నాటిన ఆబ్కారీ మంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని తన జన్మదినం సందర్భంగా..

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో శ్రీనివాస్‌గౌడ్‌.. తన పుట్టిన రోజున మొక్కలు నాటిన ఆబ్కారీ మంత్రి
Minister Srinivas Goud In G
K Sammaiah
|

Updated on: Mar 16, 2021 | 11:47 AM

Share

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం అప్రతిహాతంగా కొనసాగుతోంది. పలువురు రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గారు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి KTR ల సూచనల మేరకు గిఫ్ట్ ఏ స్మైల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిగ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపు మేరకు నేడు హైదరాబాద్ లోని తన నివాసంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఈరోజు నా జన్మదినం సందర్భంగా హంగు ఆర్భాటాలు లేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వాతావరణ కాలుష్యం తగ్గించడానికి రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటానని చెప్పారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా సందర్భం ఏదైనా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని మంత్రి పిలుపునిచ్చారు.

తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ జన్మదినం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి, అందరిని కలవక పోవడం అన్యాదా భవించవద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.