మున్సిపల్‌ ఫలితాలతో వైసీపీ నేతల్లో ఫుల్‌ జోష్‌… ఆ మేయర్‌ పీఠం వైసీపీదేనన్న ఎంపీ భరత్‌

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పంచాయతీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఘనవిజయం సాధించింది. మెజార్టీ పంచాయతీలను, మున్సిపాల్టీలను దక్కించుకుని..

మున్సిపల్‌ ఫలితాలతో వైసీపీ నేతల్లో ఫుల్‌ జోష్‌... ఆ మేయర్‌ పీఠం వైసీపీదేనన్న ఎంపీ భరత్‌
Mp Bharat Victory

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పంచాయతీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఘనవిజయం సాధించింది. మెజార్టీ పంచాయతీలను, మున్సిపాల్టీలను దక్కించుకుని తన బాలాన్ని చాటింది. దీంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలనకు ప్రజలు పూర్తి సంతృప్తిని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల రూపంలో తెలియజేశారని రాజమండ్రి ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు.

రాజమండ్రి మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలోని ఎంపీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల విజయోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. పార్టీ రంగులతో తయారు చేసిన భారీ కేక్ను ఎంపి భరత్ రామ్ కట్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యాలయం ప్రాంగణంలో ఎంపి భరత్ రామ్ తదితరులు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎంపీ భరత్ రామ్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ సమర్థవంతమైన పాలనపై సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఓట్ల రూపంలో తమ మద్దతు తెలిపారన్నారు. జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని ప్రజలు చూపించారని, వారి నమ్మకం మరింత పొందడానికి పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజా సేవలో నిమగ్నం కావలసిన అవసరం ఉందన్నారు.

గతంలో చంద్రబాబు అమలు చేయలేని 600 పై చిలుకు హామీలతో ప్రజలను మోసగించడానికి యత్నించారని, ఆయనపైనా, ఆయన ఇచ్చిన హామీలపైనా విశ్వాసం లేని ప్రజలు మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీని ఘోరంగా ఓడించి తగిన గుణపాఠం చెప్పారన్నారు. నగర, పట్టణ ప్రజలు ఇచ్చిన విజయాన్ని స్పూర్తిగా తీసుకుని రాబోయో కాలంలో జరిగే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలలో విజయదుంధిభి మోగిస్తామని, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బహుమతిగా ఇస్తామని అన్నారు. మేయర్ స్థానాన్ని సాధించుకునేందుకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా ఐక్యంగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Click on your DTH Provider to Add TV9 Telugu