AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ సొంతగడ్డపై కాంగ్రెస్ సమావేశం.. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న హార్దిక్ పటేల్?

గుజరాత్ : లోక్‌సభ ఎన్నికల నగారా మోగగానే రాజకీయ పార్టీలన్నీ తమ ‘సన్నాహాలను ముమ్మరం చేశాయి. ప్రధానంగా కాంగ్రెస్ తన పూర్వవైభవం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి ప్రధాని మోదీ సొంతగడ్డపై నుంచే నాంధి పలకేందుకు సిద్ధమైంది. ప్రధాని మోదీ సొంతగడ్డగా పేరొందిన గుజరాత్‌లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల సన్నాహాల గురించి చర్చించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా […]

మోదీ సొంతగడ్డపై కాంగ్రెస్ సమావేశం.. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న హార్దిక్ పటేల్?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 12, 2019 | 1:44 PM

Share

గుజరాత్ : లోక్‌సభ ఎన్నికల నగారా మోగగానే రాజకీయ పార్టీలన్నీ తమ ‘సన్నాహాలను ముమ్మరం చేశాయి. ప్రధానంగా కాంగ్రెస్ తన పూర్వవైభవం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి ప్రధాని మోదీ సొంతగడ్డపై నుంచే నాంధి పలకేందుకు సిద్ధమైంది. ప్రధాని మోదీ సొంతగడ్డగా పేరొందిన గుజరాత్‌లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల సన్నాహాల గురించి చర్చించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పాటు పార్టీకి చెందిన ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సుమారు 58 ఏళ్ల అనంతరం గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పాటీదార్ నేత హార్ధిక్ పటేల్ ఈ సమావేశాలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలం క్రితమే రాహుల్ ని కలిసినట్లు వార్తలు వెలువడ్డ నేపథ్యంలో.. నేడు రాహుల్ సమక్షంలోనే కండువా కప్పుకొనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హార్దిక్ పటేల్ జామ్‌నగర్ లోక్‌స‌భ సీటు నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హార్దిక్ పటేల్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైనముద్ర వేశారు. కాగా కాంగ్రెస్ ఈ సమావేశాన్నిగతంలో ఫిబ్రవరి 27న నిర్వహించాలని నిర్ణయించింది. అయితే బాలాకోట్‌లో జరిగిన ఎయిర్ స్ట్రయిక్ నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ రోజు జరగనున్న సమావేశంలో ముందుగా మహాత్మాగాంధీకి నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రసంగించనున్నారు.

అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
చరిత్రలో ఎన్నడూ చూడని వింత మ్యాచ్‎ల కోసం గెట్ రెడీ
చరిత్రలో ఎన్నడూ చూడని వింత మ్యాచ్‎ల కోసం గెట్ రెడీ
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
నేషనల్ కాదమ్మా.. మనదంతా ఇంటర్నేషనల్.. హాలీవుడ్‌కు ఇంకా హడలే
నేషనల్ కాదమ్మా.. మనదంతా ఇంటర్నేషనల్.. హాలీవుడ్‌కు ఇంకా హడలే
అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు
అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు
ప్రపంచంలోని 5 అత్యుత్తమ కెమెరా ఫోన్లు..ఐఫోన్ ర్యాంకింగ్ తెలిస్తే
ప్రపంచంలోని 5 అత్యుత్తమ కెమెరా ఫోన్లు..ఐఫోన్ ర్యాంకింగ్ తెలిస్తే
9 నెలల్లోనే చారిత్రాత్మక ఒప్పందం.. !
9 నెలల్లోనే చారిత్రాత్మక ఒప్పందం.. !
మీ ఫోన్‌ నుంచి ఈ మూడు యాప్‌లు డిలీట్ చేయండి.. కేంద్రం హెచ్చరిక
మీ ఫోన్‌ నుంచి ఈ మూడు యాప్‌లు డిలీట్ చేయండి.. కేంద్రం హెచ్చరిక
వరల్డ్ కప్ ముందు కివీస్ పని పట్టబోతున్న గంభీర్ సేన
వరల్డ్ కప్ ముందు కివీస్ పని పట్టబోతున్న గంభీర్ సేన
హీరోగా వచ్చిన ఆఫర్స్ కాదని.. శోభన్ బాబు మనవడు ఏం చేస్తున్నాడంటే..
హీరోగా వచ్చిన ఆఫర్స్ కాదని.. శోభన్ బాబు మనవడు ఏం చేస్తున్నాడంటే..