ఎలక్షన్ కోడ్.. డబ్బు తరలింపులో ఆంక్షలు
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పటిలాగే నగదు తరలింపుపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతారు. ఈ క్రమంలో రూ. 50 వేలకు మించి నగదు తరలించే సామాన్య ప్రజానీకం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రూ. 50 వేలకు మించి డబ్బు తరలించిన సమయంలో.. అది అధికారులకు పట్టుబడితే తప్పనిసరిగా […]
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పటిలాగే నగదు తరలింపుపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతారు. ఈ క్రమంలో రూ. 50 వేలకు మించి నగదు తరలించే సామాన్య ప్రజానీకం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రూ. 50 వేలకు మించి డబ్బు తరలించిన సమయంలో.. అది అధికారులకు పట్టుబడితే తప్పనిసరిగా ఆధారాలు చూపాల్సిందే. లేని యెడల ఆ నగదును అధికారులు సీజ్ చేసి.. ఐటీ అధికారులకు అప్పగిస్తారు. ఒక్క నగదుకే ఆధారాలు తప్పనిసరి కాదు. బంగారం, వెండి కొనుగోలు చేసి తరలించిన పక్కా రశీదులు పొందాలి. ఒక వేళ కొదవ పెట్టిన బంగారాన్ని విడిపించినా దానికి సంబంధించిన పత్రాలను వెంటనే ఉంచుకోవాలి. ఇక ఆస్పత్రుల్లో వైద్య ఖర్చుల కోసం భారీ మొత్తంలో డబ్బును తీసుకెళ్తుంటారు. ఇలాంటి వారు సైతం రోగి అడ్మిట్ అయిన ఆస్పత్రి రశీదులు.. ఇతర ఆధారాలను చూపిస్తే సరిపోతోంది. కనుక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పక్కా ఆధారాలతో బయటకు వస్తే మంచిది.