సీన్ రివర్స్….విజయవాడ వైసీపీ అభ్యర్థిగా పీవీపీ?
అమరావతి :బెజవాడ వైసీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) రేపు వైకాపా అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసే అవకాశం ఉంది. కాగా ఈ నెల 23న ఆయన నామినేషన్ వేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లోనే వైసీపీ తరఫున పీవీపీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు […]
అమరావతి :బెజవాడ వైసీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) రేపు వైకాపా అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పీవీపీ పోటీ చేసే అవకాశం ఉంది. కాగా ఈ నెల 23న ఆయన నామినేషన్ వేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లోనే వైసీపీ తరఫున పీవీపీ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయనకు సీటు దక్కలేదు. ఈ సారి కూడా ఆయన విజయవాడ నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడంతో వైకాపా అధిష్ఠానం కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.
అయితే విజయవాడ లోక్‌సభ స్థానం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ఇటీవల దాసరి జైరమేశ్ తెదేపా నుంచి వైకాపాలో చేరారు. ఆయన సొదరుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థన్‌రావు కూడా ఇటీవలే పార్టీలో చేరారు. దీంతో ఆయన భవిష్యత్ సందిగ్ధంలో పడింది. జైరమేశ్‌ను పక్కనబెట్టడంపై ఆయన వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.