వైయస్‌ షర్మిల తెలంగాణ బిడ్డే.. రాష్ట్రం విడిపోయాక ఇక పంచాయతీ ఎందుకన్న మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి

ఏపీ సీఎం వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి, దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైయస్‌ షర్మిల ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు కొత్త పుంతలు..

వైయస్‌ షర్మిల తెలంగాణ బిడ్డే.. రాష్ట్రం విడిపోయాక ఇక పంచాయతీ ఎందుకన్న మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి
Follow us

|

Updated on: Feb 16, 2021 | 12:45 PM

ఏపీ సీఎం వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి, దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైయస్‌ షర్మిల ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇంతకాలం సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ చుట్టూ తిరిగిన తెలంగాణ రాజకీయాలు.. బండి సంజయ్‌ రాకతో గాలి బీజేపీ వైపు మళ్లినట్లు కనిపించింది. తాజాగా తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ షర్మిల ఎంట్రీతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయాయి. తెలంగాణలో ప్రత్యేక పార్టీ ఏర్పాటుపై స్పీడ్‌ పెంచిన షర్మిలతో లోటస్‌ పాండ్‌ కేంద్రంగా వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున వైయస్‌ అభిమానులు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే.. వైఎస్ జయంతి రోజున కానీ.. వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు కానీ పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని షర్మిల టీం అంచనా వేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఫక్తు సమైక్య వాదం వినపించిన షర్మిల.. తెలంగాణకు బద్ధ విరోధి అయిన వైఎస్సార్ కుమార్తె.. రాజకీయంగా ఆదరణ ఉండదన్న విమర్శలను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కొట్టి పడేశారు. లోటస్‌పాండ్‌లో షర్మిలతో సుదీర్ఘంగా చర్చించిన ఆయన.. ఆమెకు రాజకీయంగా ఆదరణ ఉండదన్న అంచనాలు తలక్రిందులవడం ఖాయమన్నారు.

ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలు ఎవరి సొత్తు కాదని మాగం రంగారెడ్డి అన్నారు. షర్మిల కొత్త పార్టీని తాను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని.. తెలంగాణలో పని చేసేందుకు వస్తున్నమహిళల్ని ప్రజలు స్వాగతించాలని కోరారు. దేశంలో ఎక్కడ పుట్టినా.. ఎక్కడైనా పని చేయొచ్చని.. తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత స్వస్థలం కేరళ అని గుర్తు చేశారు. షర్మిల హైదరాబాద్‌లోనే పుట్టారని ఆమె తెలంగాణ బిడ్డే అని రంగారెడ్డి గుర్తు చేశారు.

Read more:

బాసర సరస్వతి అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ.. చిన్నారులకు అక్షరాభ్యాసం కోసం పోటెత్తిన భక్తులు

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..