AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ.. నేటి నుంచి ఐదు రోజుల పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి  రిట‌ర్నింగ్ అధికారి..

తెలంగాణలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ.. నేటి నుంచి ఐదు రోజుల పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తుల స్వీకరణ
K Sammaiah
|

Updated on: Feb 16, 2021 | 1:41 PM

Share

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ తో పాటు వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ నియోజకవర్గానికి ఎన్నికల అధికారి, గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్‌ అదనపు కమిషనర్ ప్రియాంక అల నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. అలాగే, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నేటి నుంచి ఈ నెల 23వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆ త‌ర్వాతి రోజే నామినేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. ఉపసంహరణకు 26వరకు తుది గడువు విధించారు. మార్చి 14న పోలింగ్, 17 ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగుస్తుంది. ఈ ఎన్నిక‌ల‌కు ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్‌-ఖమ్మం-నల్గొండ అభ్యర్థిగా రాములు నాయక్‌, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ అభ్య‌ర్థిగా చిన్నారెడ్డి పేర్ల‌ను ఖరారు చేసింది. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీ చేయ‌నున్నారు. ఇదే స్థానం నుంచి టీజేఎస్ అధ్య‌క్షుడు కోదంరాం బరిలోకి దిగనున్నారు. మిగ‌తా పార్టీలూ త‌మ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే పనిలో పడ్డాయి

ఇక మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ అభ్య‌ర్థిగా బీజేపీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ పోటీ చేయ‌నున్నారు. ఆయ‌న‌కు వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ పోటీలో నిలవ‌నున్నారు. ఈ స్థానంలో టీఆర్‌ఎస్ ‌ఇంకా అభ్య‌ర్థిని ప్రకటించలేదు.

నేటి నుంచి పోస్ట‌ల్ బ్యాలెట్ ద‌ర‌ఖాస్తుల అధికారులు స్వీక‌రిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్ బాధితుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యం క‌ల్పించ‌నున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు పోస్ట‌ల్ బ్యాలెట్ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

Read more:

వైయస్‌ షర్మిల తెలంగాణ బిడ్డే.. రాష్ట్రం విడిపోయాక ఇక పంచాయతీ ఎందుకన్న మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్