బాసర సరస్వతి అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ.. చిన్నారులకు అక్షరాభ్యాసం కోసం పోటెత్తిన భక్తులు
తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి పర్వదినం సందర్భంగా సరస్వతి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చిన్నారులకు అక్షరాభ్యాసం చేసేందుకు..
తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి పర్వదినం సందర్భంగా సరస్వతి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చిన్నారులకు అక్షరాభ్యాసం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాసర జ్ఞానసరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వసంత పంచమి సందర్భంగా తెల్లవారు జాము నుంచే భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. ముఖ్యంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు వచ్చిన భక్తులతో నాలుగు మండపాలు ఫుల్ అయ్యాయి. సరస్వతిదేవి జన్మదినం కావడంతో అమ్మవారికి తెల్లవారు జామునే ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు.
వసంత పంచమి సందర్భంగా బాసరలో అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి పుట్టిన రోజు కూడా ఇవాళే కావడంతో ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించారు. బాసర పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు.
వసంత పంచమి వేడుకలతో సిద్దిపేట జిల్లా వర్గల్ సరస్వతి ఆలయం భక్తులతో కళకళలాడుతోంది. ఇక్కడ కొలువైన విద్యాధరి అమ్మవారికి తెల్లవారు జామునే అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. చండీహోమం, లలితా సహస్రనామ పారాయణం, పటించారు. విద్యాధరి అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం వెలుపల కూడా క్యూలైన్లు ఉన్నాయి. దర్శనం కోసం గంటల సమయం పడుతోంది.
Read more: