CM KCR – TRS: టీఆర్‌ఎస్ స్థానిక ఎమ్మెల్సీల జాబితా ఖరారు.. ఆ 12 మంది జాబితాకు గ్రీన్‌సిగ్నల్
టీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ దాదాపు ఫైనల్ అయింది. 12 మందితో కూడిన జాబితాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు CM KCR. ఒక్కసారి జిల్లాల వారీగా ఖరారైన..

టీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ దాదాపు ఫైనల్ అయింది. 12 మందితో కూడిన జాబితాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు CM KCR. ఒక్కసారి జిల్లాల వారీగా ఖరారైన అభ్యర్థుల పేర్లను పరిశీలిద్దాం. ఈ లిస్ట్ ప్రకారం ఏడుగురి సిట్టింగ్ స్థానాలు గల్లంతయ్యాయి. అభ్యర్థుల ఎంపిక కోసం పెద్ద కసరత్తే జరిగింది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను లెక్కలోకి తీసుకున్నారు. ఇక కవితకు రాజ్యసభ దాదారు ఖరారైనట్లే తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో MLCగా ఎంపికైన బండ ప్రకాష్ స్థానంలో కవిత రాజ్యసభకు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఈ జాబితాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
జిల్లాల వారీగా ఖరారైన అభ్యర్థుల పేర్లు..
వరంగల్-పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కరీంనగర్-ఎల్.రమణ, భానుప్రసాద్ నిజామాబాద్-ఆకుల లలిత ఆదిలాబాద్-దండె విఠల్ మెదక్-భూపాల్ రెడ్డి లేదా యాదవ్‌రెడ్డి ఖమ్మం-తాత మధు.. మహబూబ్‌నగర్-గాయకుడు సాయిచంద్ మహబూబ్‌నగర్-కసిరెడ్డి నారాయణరెడ్డి నల్గొండ-సి.కోటిరెడ్డి రంగారెడ్డి-శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్‌రెడ్డి
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం.. కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు షెడ్యూల్ ప్రకటించింది EC. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 23 . నవంబర్ 24న పరిశీలన, నవంబర్ 26 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది., డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న కౌంటింగ్ జరగనుంది.
ఇవి కూడా చదవండి: CM KCR -Samyukta Kisan Morcha: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు.. ఉదారతను అభినందించిన రైతు సంఘాలు..
SBI Alerts: ఇలాంటి కాల్స్ మీకు వస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. హెచ్చరించిన బ్యాంక్..
Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..