CM KCR -Samyukta Kisan Morcha: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు.. ఉదారతను అభినందించిన రైతు సంఘాలు..

సీఎం కేసీఆర్ నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు జల్లు కురుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతించింది సంయుక్త కిసాన్ మోర్చా. మరణించిన 700మంది రైతుల జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించింది.

CM KCR -Samyukta Kisan Morcha: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు.. ఉదారతను అభినందించిన రైతు సంఘాలు..
Cm Kcr
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 21, 2021 | 7:45 PM

Samyukta Kisan Morcha: తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై మొదలైన కేసీఆర్ రైతు ఉద్యమం ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్లింది. రైతుల పోరాటంతోనే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దయ్యాయని కేసీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే.. చట్టాలు రద్దు చేసినట్లుగానే.. రైతులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ నుంచి రూ.3 లక్షల పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

రైతు పోరాటంలో మరణించిన 750 రైతుల కుటుంబాలకు సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే పేర్లు ఇవ్వాలని రైతు సంఘం నాయకులకు సూచించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సారీ చెప్పి చేతులు దులుపుకోవడం కాదని.. ప్రతి కుటుంబానికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని.. కేసీఆర్ ప్రధాని మోదీకి సూచించారు. వ్యవసాయ రంగంలో కూడా ఆత్మనిర్భర్ అమలు చేయాలని సూచించారు.

సీఎం కేసీఆర్ నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు జల్లు కురుస్తోంది. రాజకీయ ప్రముఖుల నుంచి సినీ ప్రముఖుల వరకు సీఎం ఉదారతను అభినందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.  అయితే తాజాగా సంయుక్త కిసాన్ మోర్చా కూడా అభినందించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతించింది సంయుక్త కిసాన్ మోర్చా. మరణించిన 700మంది రైతుల జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం రైతు కుటుంబాలకు పరిహారం 25 లక్షల ఇవ్వాలని కేసీఆర్ ప్రతిపాదనను స్వాగతించాయి రైతు సంఘాలు. చట్టాలు ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగుతుందన్న సంయుక్త కిసాన్ మోర్చా హెచ్చరించింది. యథావిధిగా ఆందోళనలు ఈ నెల 26న ఢిల్లీ బోర్డర్ మోర్చే చలో, ఈ నెల 29న చలో పార్లమెంట్ ఉంటాయని ప్రకటించిది. ప్రధాని మోడీకి డిమాండ్లపై ఓపెన్ లెటర్ రాయాలని నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి: SBI Alerts: ఇలాంటి కాల్స్ మీకు వస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. హెచ్చరించిన బ్యాంక్..

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..