Bandi Sanjay: అందుకే క్షమాపణలు చెప్పలా.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ ప్రశ్నలు..

Bandi Sanjay comments on CM KCR: ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినందుకే క్షమాపణలు చెప్పాలా అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రైస్‌ మిల్లర్ల

Bandi Sanjay: అందుకే క్షమాపణలు చెప్పలా.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ ప్రశ్నలు..
Bandi Sanjay
Follow us

|

Updated on: Nov 21, 2021 | 6:40 PM

Bandi Sanjay comments on CM KCR: ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినందుకే క్షమాపణలు చెప్పాలా అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రైస్‌ మిల్లర్ల కోసమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ధర్నా చేశారని బండి సంజయ్‌ విమర్శించారు. కేసీఆర్‌ దీక్ష చేయడానికి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టాలు రద్దు చేయడానికి ఏమైనా సంబంధం ఉందా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే కేంద్రం దిగొచ్చిందా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు బండి సంజయ్ హైదరాబాద్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ దీక్ష చేసింది రాష్ట్ర రైతుల కోసమా.. పంజాబ్‌ రైతుల కోసమా అంటూ ప్రశ్నించారు. దీక్ష దేనికి అన్నది అర్థం కాలేదంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

ధర్నా చౌక్‌ తీసేయాలన్న ముఖ్యమంత్రి అక్కడే ధర్నా చేశారంటూ బండి సంజయ్ విమర్శించారు. మిల్లర్లతో కలిసి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని ఆయన ఆరోపించారు. రైతుల కోసం ఆలోచించే పార్టీ బీజేపీ అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి రైతులకు రూ.3లక్షలు ఇస్తారంట.. మరి తెలంగాణలో చనిపోయిన రైతులకు ఇవ్వరా..? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందంటూ సంజయ్ వివరించారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం ఇవ్వాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. వర్షాల వల్ల వడ్లు కొట్టుకుపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే సీఎం పట్టించుకోవడం లేదన్నారు.

Also Read:

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..

MLA Anagani Satyaprasad: స్పీకర్ తమ్మినేని సీతారాంకు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ