జాబు రావాలంటే.. బాబు మళ్ళీ రావాల్సిందే: మడకశిర ప్రచార సభలో చంద్రబాబు

రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా తయారుచేస్తామని, ప్రపంచం మొత్తం ఏపీ పండ్లు తినే రోజు వస్తుందన్నారు. బుధవారం మడకశిరలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన చ‍ంద్రబాబు వచ్చే ఐదేళ్లలో మడకశిరలో ఊహించని అభివృద్ధి చేస్తానని, వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం కరువు జిల్లా కాదనేలా తీర్చిదిద్దుతామన్నారు. జాబు రావాలంటే.. బాబు రావాల్సిందేనని నినదించారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.15 […]

జాబు రావాలంటే.. బాబు మళ్ళీ రావాల్సిందే: మడకశిర ప్రచార సభలో చంద్రబాబు
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2019 | 9:05 PM

రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా తయారుచేస్తామని, ప్రపంచం మొత్తం ఏపీ పండ్లు తినే రోజు వస్తుందన్నారు. బుధవారం మడకశిరలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన చ‍ంద్రబాబు వచ్చే ఐదేళ్లలో మడకశిరలో ఊహించని అభివృద్ధి చేస్తానని, వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం కరువు జిల్లా కాదనేలా తీర్చిదిద్దుతామన్నారు. జాబు రావాలంటే.. బాబు రావాల్సిందేనని నినదించారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. త్వరలో 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అనంతపురం జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తనదని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు నదుల అనుసంధానం చేస్తామన్నారు. 1000 కిలోమీటర్లు నదుల అనుసంధానం చేసిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందన్నారు. హంద్రీనీవా ద్వారా మడకశిరకు నీళ్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సముద్రంలో కలిసే నీటిని మళ్లించి రైతులకు ఇస్తున్నామని చెప్పారు. ప్రత్యేకహోదా రాష్ట్ర ప్రజల హక్కు అని, ప్రత్యేక హోదాను సాధించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులకు రూ.24,500 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. వచ్చేనెలలో 4వ, 5వ విడత రుణమాఫీ డబ్బులిస్తామని ప్రకటించారు. కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామన్నారు.

దేశంలో మోదీ మళ్లీ గెలిస్తే ముస్లింలకు రక్షణ ఉండదన్నారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి ఏపీపై కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీని నెంబర్ వన్ చేస్తానని అన్నారు. జగన్‌కు ఓటేస్తే మోదీకి, కేసీఆర్‌కు వేసినట్లేనని అన్నారు. జగన్‌ వస్తే పరిశ్రమలు, పెట్టుబడులు రావని తెలిపారు.

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..