ఇవాళ్టి నుంచి చంద్రబాబు ప్రచారం ప్రారంభం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ముందుగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటలకు తిరుపతిలో సేవా మిత్ర, బూత్ కమిటీలతో సమావేశం అవుతారు. తిరుపతి సమావేశం తరువాత శ్రీకాకుళం వెళ్లనున్న చంద్రబాబు, అక్కడి కోడి రామ్మూర్తి గ్రౌండ్‌లో జరిగే ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. రాత్రి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు చంద్రబాబు. మరోవైపు లోక్‌సభ అభ్యర్థుల […]

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ముందుగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటలకు తిరుపతిలో సేవా మిత్ర, బూత్ కమిటీలతో సమావేశం అవుతారు.
తిరుపతి సమావేశం తరువాత శ్రీకాకుళం వెళ్లనున్న చంద్రబాబు, అక్కడి కోడి రామ్మూర్తి గ్రౌండ్‌లో జరిగే ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. రాత్రి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు చంద్రబాబు. మరోవైపు లోక్‌సభ అభ్యర్థుల జాబితా దాదాపుగా రెడీ అయినప్పటికీ, దాన్ని ప్రకటించకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా నాలుగైదు స్థానాలపై క్లారిటీ వచ్చాక మొత్తం జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.



